Chief Justice : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు..
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు చీఫ

Ap Telangana Chief Justice
Chief Justice : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియామకం జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రాలను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేశారు. ఇటీవల వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా వ్యవహరించిన హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.
Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!
అలాగే పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి కల్పించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ప్రకాశ్ శ్రీవాస్తవను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ ను గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వి మోరేకు మేఘాలయ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పించారు.
జస్టిస్ మిశ్రా..
ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు.
Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..
సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టుకు సీజేగా నియమితులయ్యారు.
జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ..
1961, నవంబర్ 30వ తేదీన భోపాల్‌లో జన్మించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్న సతీశ్ చంద్ర శర్మ.. మధ్యప్రదేశ్‌లో ఒక లీడింగ్ లాయర్‌గా పేరు గాంచారు. ఆయనకు 42 ఏళ్ల వయసున్నప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్‌గా ప్రమోషన్ పొందారు. తద్వారా ఆ రాష్ట్ర హైకోర్టు చరిత్రలో పిన్న వయసులో సీనియర్ అడ్వొకేట్‌గా బాధ్యతలు చేపట్టిన అతి కొద్దిమందిలో స్థానం సంపాదించారు.
2008, జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా నియమితులైన ఆయన.. 2010, జనవరి 10న పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్నారు. 2020, డిసెంబర్ 31న కర్ణాటక హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ అయిన సతీశ్ చంద్ర శర్మ.. 2021, జనవరి 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై ఈ ఏడాది, ఆగస్టు 31 వ తేదీ నుంచి కర్ణాటక హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.