BRS MPS : కాంగ్రెస్‌తో టచ్‌లో ముగ్గురు ఎంపీలు? పోటీకి సిట్టింగ్‌ల విముఖత.. బీఆర్ఎస్‌‌కు కొత్త టెన్షన్

ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

New Tension For BRS

గులాబీ పార్టీకి కొత్త గుబులు పట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిట్టింగ్‌లు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, గత ఐదేళ్లలో ఎంపీలుగా ఎదురైన అనుభవంతో కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే.. మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేసినా, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోన్న గులాబీ దళానికి.. ఆదిలోనే హంసపాదు ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మరిన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకునేలా క్షేత్రస్థాయిలో పావుల కదుపుతోంది ఆ పార్టీ అగ్రనాయకత్వం.

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

కాంగ్రెస్‌తో టచ్‌లో ముగ్గురు ఎంపీలు?
అయితే.. బీఆర్‌ఎస్ ప్రయత్నాలకు సిట్టింగ్ ఎంపీలు గండి కొడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. కొందరు సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం గులాబీ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎంపీలు..
ఇలా అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండటంతో గులాబీ దళంలో అనుమానాలు ఎక్కువయ్యాయి. గత పదేళ్లుగా ఎదురైన అనుభవాలను తమ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్న ఎంపీలు.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకు లోకసభ సభ్యులమే అయినా.. ఎమ్మెల్యేల చెప్పు చేతల్లోనే ఉండాల్సి వచ్చేదని.. తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఎక్కువ మంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలే ప్రధానంగా భావించే పార్టీలో ఎంపీలుగా పని చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read : అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

చాన్స్ వస్తే కాంగ్రెస్ నుంచి పోటీ?
మరోవైపు హైకమాండ్ మాత్రం సిట్టింగ్‌ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడుతోంది. దీంతో సిట్టింగ్ ఎంపీలు ఎలాంటి వైఖరి తీసుకుంటారో అన్న ఉత్కంఠ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న పలువురు నేతలు కూడా ఎంపీలుగా అవకాశం దక్కితే కాంగ్రెస్ తరఫున పోటీకే రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు