Farmhouse Party Case: ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్.. విజయ్ మద్దూరి కీలక వ్యాఖ్యలు

ఓరియన్ విల్లాస్ రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల, నాగేశ్వర్ రెడ్డి ఇండ్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓరియన్ విల్లాస్ లో ..

Janwada Farmhouse Party Case

Janwada Farmhouse Party Case: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మోకిల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఏ1 రాజ్ పాకాలా, ఏ2గా విజయ్ మద్దూరిలను చేర్చారు. ఇప్పటికే రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు మోకిలా పోలీసులు చెబుతున్నారు. విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని ఆదివారం విచారించారు. తాను డ్రగ్ కన్జూమర్ ని అని పోలీసులకు విజయ మద్దూరి చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సెక్షన్ 25, 27, 29 NDPS, 3, 4 TSGA యాక్ట్ కింద మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ మరోసారి విజయ్ మద్దూరిని పోలీసులు విచారించనున్నారు.

Also Read: జన్వాడ ఫామ్‌హౌజ్‌ పార్టీలో పాల్గొన్న అందరి పేర్లను బయటపెట్టాలి : బండి సంజయ్

ఓరియన్ విల్లాస్ లో రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల, నాగేశ్వర్ రెడ్డి ఇండ్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. విల్లా నంబర్ 5, 40, 43లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 53 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జన్వాడ ఫాం హౌజ్ లో సైతం భారీగా విదేశీ, స్వదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 34(a)34(1)9(1) ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు.

Also Read: Actor Vijay TVK : రాజకీయాల్లో నేను చిన్నపిల్లాడినే.. కానీ భయపడను.. వెనక్కి తగ్గేదేలేదు.. ఫస్ట్ స్పీచ్‌తోనే అదరగొట్టిన విజయ్

ఇదిలాఉంటే.. మోకిల రాజ్ పాకాల ఫాంహౌస్ పార్టీ కేసులో కొత్త మలుపు తిరిగింది. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను చెప్పని విషయాలను ఎఫ్ఐఆర్ లో రాశారంటూ ఆయన ఆరోపించారు. తనపై అక్రమ కేసులు పెట్టారని వాపోయాడు. పార్టీలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదని, కావాలనే తమను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అయితే, నిన్న విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. ఇవాళ మరోసారి మోకిలా పోలీసులు విజయ్ మద్దూరిని విచారించనున్నారు.