జన్వాడ ఫామ్‌హౌజ్‌ పార్టీలో పాల్గొన్న అందరి పేర్లను బయటపెట్టాలి : బండి సంజయ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఊహాజనిత ప్రకటనలు ఇవ్వడం ద్వారా కేసు తీవ్రతను తగ్గించాలని చూస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.

జన్వాడ ఫామ్‌హౌజ్‌ పార్టీలో పాల్గొన్న అందరి పేర్లను బయటపెట్టాలి : బండి సంజయ్

Bandi Sanjay

Updated On : October 27, 2024 / 2:50 PM IST

Rave Party at Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌజ్ పార్టీలో పాల్గొన్న వారందరి పేర్లను బయటపెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు నటిస్తోంది.. కానీ, నిజానికి బీఆర్ఎస్ పెద్దలను కాపాడుతోందని ఆయన విమర్శించారు. ఫాంహౌజ్ ‘రేవ్ పార్టీ’ కేసులో నీరుగార్చే కుట్ర మొదలైంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కొందరు కాంగ్రెస్ నేతల నుండి ఒత్తిడి మొదలైందని బండి సంజయ్ ఆరోపించారు.

Also Read: MP Raghunandan Rao: ఫాంహౌస్ చుట్టూఉన్న సీసీ ఫుటేజ్‌ను వెంటనే రిలీజ్ చేయాలి : రఘునందన్ రావు

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో కేటీఆర్ కుటుంబ సభ్యులు, ఆయనకు దగ్గరి వ్యక్తులతోపాటు ముఖ్యంగా డ్రగ్స్ సప్లయ్ చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్లు సమాచారం ఉందని బండి సంజయ్ అన్నారు. పార్టీలో పాల్గొన్న వారు పలుకుబడి కలిగిన వ్యక్తులుగా తెలుస్తోంది.. వారి నుంచి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలి. ప్రతి సీసీటీవీ పుటేజీలను విడుదల చేయాలి. ఎలాంటి ఉదాసీనత లేకుండా.. తప్పించుకునే మార్గాలు లేకుండా తక్షణమే అరెస్టులు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read: కేటీఆర్ బావమరిది ఫాం హౌస్‌పై పోలీసుల దాడులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పోలీస్ వ్యవస్థపై పక్కా నమ్మకం ఉంది.. కానీ, గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తానా కారణంగా కొంతమంది పోలీసు అధికారులు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానితోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే హోంశాఖ ఉంది. ఆయనే స్వయంగా ఈ కేసుపై దృష్టిసారించాలని బండి సంజయ్ కోరారు.