గుడ్‌న్యూస్‌.. నిజామాబాద్‌లో పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించనున్న పీయూష్ గోయల్‌

జాతీయ పసుపు బోర్డుకు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించారు.

గుడ్‌న్యూస్‌.. నిజామాబాద్‌లో పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించనున్న పీయూష్ గోయల్‌

Updated On : January 13, 2025 / 8:58 PM IST

నిజామాబాద్‌ జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల నాటి కల నెరవేరనుంది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కానుంది. నిజామాబాద్‌ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ఉంటాయి. పసుపు బోర్డును మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ ప్రారంభించనున్నారు.

జాతీయ పసుపు బోర్డుకు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. కేంద్ర సర్కారు ఇవాళ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గంగారెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని గతంలో పలుసార్లు బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ వేళ పసుపు బోర్డుపై ఈ మేరకు ఇప్పుడు శుభవార్త చెప్పారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. బీఆర్ఎస్‌తో పాటు పలు పార్టీలు బీజేపీని ఈ మేరకు చాలా సార్లు డిమాండ్ చేశాయి.

ఈ అరెస్టు దుర్మార్గమైన చర్య.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం: కేటీఆర్