HMPV : HMP వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదు- అపోలో ఆసుపత్రి డాక్టర్ షర్మిల

రద్దీ ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లొద్దని డాక్టర్ షర్మిల జాగ్రత్త చెప్పారు.

HMPV : HMP (హ్యుమన్ మెటా న్యుమో) వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదని అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ పీడియాట్రిషన్ డాక్టర్ షర్మిల అన్నారు. దగ్గు విపరీతంగా ఉన్నప్పుడు పరీక్ష చేయించుకోవడం ముఖ్యం అని చెప్పారు. హెచ్ఎంపీ వైరస్ కు ప్రత్యేక చికిత్స ఏమీ లేదన్నారు. లక్షణాలను బట్టే బాధితుడికి చికిత్స చేస్తామని డాక్టర్ షర్మిల తెలిపారు.

దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి..
హెచ్ఎంపీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జలుబు ఉంటుందన్నారు. మైల్డ్ ఫీవర్ ఉంటుందని ఆమె తెలిపారు. దగ్గు, జలుబు ఉంటే పిల్లలను వైద్యులకు చూపించాలన్నారు. రద్దీ ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లొద్దని డాక్టర్ షర్మిల జాగ్రత్త చెప్పారు. కోవిడ్ లో తీసుకున్నట్లే ఇప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ షర్మిల సూచించారు.

Also Read : 2025లో ప్రపంచాన్ని కలవరపెడుతున్న 11 కొత్త రోగాలు ఏంటి? బాబా వంగా, నోస్ట్రడామస్‌ చెప్పిందే నిజం అవుతుందా?

గుండె, కిడ్నీ జబ్బులు ఉన్న వారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపే అవకాశం..
‘విపరీతంగా దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పిల్లలతో పాటు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. 65 ఏళ్లు పైబడిన వారు అలర్ట్ గా ఉండాలి. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. గుండె, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దగ్గు, జలుబు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. స్వాబ్ టెస్ట్ చేయడం ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. గంటల (6 గంటలు) వ్యవధిలోనే తెలిసిపోతుంది.

ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది, స్టెరాయిడ్స్ వాడాల్సి రావొచ్చు..
పిల్లల్లో వచ్చినప్పుడు ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం పడుతుంది. ఆసుపత్రిలో చేరాల్సి రావడం. ఇలాంటివి జరగొచ్చు. అందరికీ అలానే జరగొచ్చని చెప్పలేము. దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం, వాంతులు.. ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు” అని డాక్టర్ షర్మిల చెప్పారు.

భారత్ లో హెచ్ఎంపీ వైరస్ కలకలం.. ఒకేరోజు మూడు కేసులు నమోదు..
ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీ వైరస్.. భారత్ లోకి కూడా ఎంటర్ అయిపోయింది. ఒకేరోజు ఏకంగా మూడు కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో రెండు కేసులు వెలుగుచూడగా, గుజరాత్ లో ఒక కేసు బయటపడింది. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిలో హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అసలు.. హెచ్ఎంపీవీ ఎంత వరకు ప్రమాదకరమైనది? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు హెచ్ఎంపీ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

పూర్తి వివరాలు..

Also Read : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!