HMPV Virus : 2025 అంతా నరకమేనా? బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజం అవుతుందా?
ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే అవకాశం ఉంది? వంగా బాబా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా?

HMPV Virus : కొత్త ఏడాదిని ఇంకా మనస్ఫూర్తిగా ఆహ్వానించనే లేదు. అప్పుడే ప్రపంచం నెత్తిన వైరస్ రూపంలో ఓ బాంబు పడింది. కరోనాను పోలి ఉండి అవే లక్షణాలతో చైనాలో విజృంభిస్తున్న ఓ వైరస్ కొత్త ఏడాది ఆనందాలను, అంచనాలను ఆవిరి చేసేస్తోంది. భయం పుట్టిస్తోంది. 2025 మొదట్లోనే ఇలా జరిగిందంటే.. ఈ ఏడాది అంతా నరకమేనా? ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే అవకాశం ఉంది? వంగా బాబా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న భయాలు ఇవే.
కొత్త ఏడాది ప్రారంభంలోనే నిద్ర లేకుండా చేస్తున్న వైరస్..
కొత్తగా కొత్త ఏడాదిని ప్రారంభించిన ప్రపంచానికి చైనాలో పుట్టిన ఓ వైరస్ నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా మిగిల్చిన పీడ కలల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వేళ.. అదే లక్షణాలతో ఉన్న వైరస్ విజృంభిస్తుండటంతో కొత్త భయాలు మొదలయ్యాయి. ఇన్ ఫ్ల్యూయెంజా ఏ తో పాటు HMPV(హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్) తో చైనా జనాలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.

HMPV Virus in China
దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..
హెచ్ఎంపీవీ వైరస్.. కరోనా లానే అంటు వ్యాధి. ప్రాణాంతకంగా కనిపిస్తోంది. హెచ్ఎంపీవీ సోకిన వారిలో దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి. 200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని తెలుస్తోంది. అప్పటి నుంచి వైరస్ పదే పదే మారుతోంది. ప్రస్తుతం ఇది పక్షులకు సోకడం లేదు. 2001లో ఈ వైరస్ ను మనుషుల్లో గుర్తించారు.
Also Read : చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్.. కోవిడ్ మహమ్మారి 2.0గా మారబోతుందా? ఈ 11 వ్యాధులపై వైద్యుల హెచ్చరిక!
HMPV వైరస్.. అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే..
వైరస్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు బ్రాంకైటిస్, న్యూమోనియాకు కూడా కారణం అయ్యే ఛాన్స్ ఉంది. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వ్యాధి బయటపడే సమయం సాధారణంగా 3 నుంచి 6 రోజులు ఉంటుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. HMPV వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే.
ప్రపంచాన్ని ముంచెత్తేందుకు 11 కొత్త రోగాలు రెడీగా ఉన్నాయా?
కరోనా అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే. రాబోయే రోజుల్లో అంతకుమించిన ప్రళయాలు చూడొచ్చు. ఇదీ కొవిడ్ సమయంలో వినిపించిన మాట. ప్రపంచాన్ని ముంచెత్తేందుకు 11 రోగాలు కాచుకుని కూర్చున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బలి కావాల్సిందే. 2025ను వెంటాడుతున్న రోగాలు ఏంటి? నరకం అంటే ఈ ఏడాదే చూడబోతున్నామా? డాక్టర్లు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? ప్రపంచ పరిణామాలు చెబుతున్నదేంటి?
2025లో ఆరోగ్య సంక్షోభాన్ని తీసుకొచ్చి మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న 11 రకాల రోగాలను గుర్తించారు. అందులో 5 రోగాలు మరీ భయపెడుతున్నాయి. దీంతో ప్రపంచం దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయం అని… వంగా బాబా, నోస్ట్రడామస్ చెప్పిందే నిజం అవుతుందా? అనే భయాలు కూడా కొందరిలో కనిపిస్తున్నాయి.
2025లో ప్రపంచాన్ని భయపెడుతున్న రోగాలు..
* ఎంపాక్స్
* బర్డ్ ఫ్లూ
* మీజిల్స్
* డెంగ్యూ
* చికున్ గున్యా
* వెస్ట్ నైల్ ఫీవర్
* స్కాబిస్
* కలరా
పూర్తి వివరాలు..
Also Read : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!