HMPV Outbreak : చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్.. కోవిడ్ మహమ్మారి 2.0గా మారబోతుందా? ఈ 11 వ్యాధులపై వైద్యుల హెచ్చరిక!
HMPV Outbreak : చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై నివేదికల మధ్య, కోవిడ్ వంటి మహమ్మారి 2.0 మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11 వ్యాధుల గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు

HMPV outbreak in China
HMPV Outbreak : కరోనాకు పుట్టినిల్లుగా పేరొందిన చైనాలో మరో డేంజరస్ వైరస్ భయాందోళన కలిగిస్తోంది. డ్రాగన్ దేశంలో హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్(HMPV) విజృంభిస్తోంది. ఇప్పటికే, వందలాది మంది బాధితులు వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి.
భారీగా కేసులు.. మహమ్మారిగా గుర్తించని చైనా :
2024 ఏప్రిల్ నుంచే హెచ్ఎంపీవీ కేసులు చైనాలో నమోదవుతున్నాయి. అయితే, ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా ప్రభుత్వం ఇప్పటికీ మహమ్మారిగా గుర్తించలేదు. శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని, పిల్లలు, వృద్ధులే ఎక్కువగా బారినపడవచ్చునని స్థానిక మీడియా వెల్లడించింది.
11 వ్యాధుల గురించి వైద్యుల ఆందోళన :
సైద్ధాంతపరంగా పరిశీలిస్తే.. చైనాలో విస్తరించే ఈ డిసీజ్ (X) ప్రభావంతో కోవిడ్-19 మళ్లీ విజృంభించేలా కనిపిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావంతో 2025లో 11 వ్యాధుల గురించి వైద్యులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. మిర్రర్ నివేదిక ప్రకారం.. తట్టు, కలరా, గజ్జి, బర్డ్ ఫ్లూ కూడా ఈ వైరస్ల జాబితాలో ఉన్నాయి.
చైనా, జపాన్‌తో సహా అనేక ఆసియా దేశాలలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వైరస్ కేసులు పెరుగుతున్నట్లు నివేదికల మధ్య ఈ నివేదిక వచ్చింది. చైనాలో రద్దీగా ఉండే ఆస్పత్రులతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నివేదికలపై సరైన ధృవీకరణ లేదు.
హెచ్ఎంపీవీ (HMPV)తో పాటు ఇన్ఫ్లుఎంజా ఎ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు.. సౌతాంప్టన్ యూనివర్శిటీలో గ్లోబల్ హెల్త్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ మైఖేల్ హెడ్ మాట్లాడుతూ.. “డిసీజ్ ఎక్స్ అనేది ఇంకా తెలియని వైరస్ పేరు. పెద్ద వ్యాప్తికి కారణమవుతుంది లేదా ఒక మహమ్మారిగా కూడా రూపుదాల్చుతుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వైరస్ కోవిడ్-19 మాదిరిగా త్వరగా వ్యాప్తి చెందగలదు. అధిక మరణాల రేటుకు దారితీయొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వైరస్ ముప్పుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తెలియని వ్యాధి కారణంగా అక్టోబర్, డిసెంబర్ 2024 మధ్య 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది పిల్లలు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దగ్గు, పోషకాహార లోపంతో తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 400 కేసులను నివేదించింది.

HMPV outbreak in China
ఇటీవలి హెచ్‌ఎమ్‌పీవీ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి ఈ వైరస్ లక్షణాలు పెద్దగా తెలియవని, చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ హెడ్ హెచ్చరించారు.
ఇతర వ్యాధులతో మహమ్మారి ముప్పు.. 11 వ్యాధుల వివరాలివే :
తట్టు :
అత్యంత అంటువ్యాధి. గాలిలో వేగంగా వ్యాపిస్తుంది. టీకా రేట్లు క్షీణించడం వల్ల తట్టు (మీజిల్స్) మళ్లీ పుంజుకుంటుంది. ఎంఎంఆర్ వ్యాక్సిన్‌తో నివారించగలిగినప్పటికీ, 2023లో 107,000 మరణాలకు కారణమైంది. ప్రధానంగా టీకాలు వేయని పిల్లల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
లక్షణాలు : ఫ్లూ-వంటి లక్షణాలు, మరో లక్షణం మచ్చలు ఏర్పడతాయి.
డెంగ్యూ జ్వరం :
డెంగ్యూను ‘బోన్ బ్రేకర్’ వ్యాధిగా పిలుస్తారు. ప్రతి ఏటా మిలియన్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ ఐరోపాలో ఈ డెంగ్యూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు : జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, తీవ్రమైన కేసుల్లో వాంతులు, చిగుళ్ళలో రక్తస్రావం, కడుపు నొప్పికి దారితీయవచ్చు.
చికున్‌గున్యా :
డెంగ్యూతో పాటు దోమల ద్వారా వ్యాపించే వైరస్. ఐరోపాలో ప్రస్తుతం అరుదుగా ఉన్నప్పటికీ, వేడెక్కుతున్న వాతావరణం ఈ వైరస్ వ్యాప్తిని పెంచే ప్రమాదం లేకపోలేదు.
లక్షణాలు : జ్వరం, దీర్ఘకాల కీళ్ల నొప్పులు, చాలా సందర్భాలలో వారంలోపు కోలుకోవచ్చు.
వెస్ట్ నైల్ ఫీవర్ :
దోమల ద్వారా వ్యాపిస్తుంది. వెస్ట్ నైల్ వైరస్ యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో న్యూరోఇన్వాసివ్ వ్యాధులకు కారణమైంది.
లక్షణాలు : జ్వరం, అలసట, మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ అనే లక్షణాలు తరచుగా కనిపిస్తాయి.
బర్డ్ ఫ్లూ (H5N1) :
మానవుని నుంచి మానవునికి సంక్రమించడం చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజాలో వేరియంట్లు ఒక మహమ్మారికి దారితీయవచ్చు.
లక్షణాలు : అధిక జ్వరం, అలసట, తలనొప్పి, తీవ్రమైన సందర్భాల్లో, చిగుళ్ళు లేదా ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు సంభవిస్తాయి.
కలరా :
ఈ అతిసార వ్యాధి, తరచుగా కలుషితమైన నీటి కారణంగా వ్యాప్తిచెందుతుంది. బలవంతంగా వలసలు, వాతావరణ సంక్షోభాల కారణంగా పెరిగే అవకాశం ఉంది.
లక్షణాలు : తీవ్రమైన విరేచనాలు, వాంతులు, వేగంగా డిహైడ్రేషన్ బారిన పడటం వంటివి ఉంటాయి.
యాంటీమైక్రోబయల్-రెసిస్టెంట్ బాక్టీరియా :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యాంటీబయాటిక్స్ వాడకం అనేది అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటిగా పరిగణించింది. (E. coli) వంటి బాక్టీరియా నిరోధకతను పెంచడం ద్వారా అధిక మరణాల రేటుకు దారితీసింది.
లక్షణాలు : ఇన్ఫెక్షన్ రకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ, అతిసారం, వాంతులు, మూత్ర నాళాల సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి.
గజ్జి :
పురుగుల వల్ల ఏర్పడే చర్మసంబంధిత వ్యాధి. గజ్జి రద్దీగా ఉండే వాతావరణంలో వృద్ధి చెందుతుంది. 2024లో యూకేలో 58శాతం పెరుగుదల కనిపించింది.
లక్షణాలు : దురద దద్దుర్లు, ముఖ్యంగా రాత్రి సమయంలో తరచుగా వేళ్ల మధ్య లేదా చర్మం మడతల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కోవిడ్ వేరియంట్లు :
ఎక్స్ఈసీ (XEC) హైబ్రిడ్ వంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీని కారణంగానే ఇన్ఫెక్షన్లు, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరుగుతుంది.
లక్షణాలు : నిరంతర దగ్గు, జ్వరం, వాసన లేదా రుచి కోల్పోవడం, ఫ్లూ వంటి లక్షణాలు
కోరింత దగ్గు :
ఈ బ్యాక్టీరియా సంక్రమణ శిశువులు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూకేలో 2024లో కేసులు 10వేలు దాటాయి.
లక్షణాలు : తేలికపాటి జలుబు వంటి లక్షణాలు, తీవ్ర దగ్గు, శ్వాస సమస్యలు ఉంటాయి.
చికున్‌గున్యా, ఇతర దోమలతో వైరస్లు :
గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో ఐరోపాలో చికున్‌గున్యా, డెంగ్యూ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రభావం పెరుగుతుందని భావిస్తున్నారు.
లక్షణాలు : డెంగ్యూ మాదిరిగానే, జ్వరం, కీళ్ల నొప్పులు సాధారణ లక్షణాలుగా ఉంటాయి.