Malla Reddy University : పురుగులు, కోడి ఈకలు వస్తున్నాయంటూ విద్యార్థుల ఆందోళన
యూనివర్సిటీ యాజమాన్యం వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Malla Reddy University
NSUI : విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎన్ఎస్ యుఐ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మల్లారెడ్డి యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు, కోడి ఈకలు వస్తున్నాయని గత మూడురోజుల నుండి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా.. కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Ka Paul : తెలంగాణ అసెంబ్లీలో కేఏ పాల్ సందడి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పోలీసులు కలగజేసుకొని మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.