Ka Paul : తెలంగాణ అసెంబ్లీలో కేఏ పాల్ సందడి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచలన వ్యాఖ్యలు

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని కేఏ పాల్ అన్నారు.

Ka Paul : తెలంగాణ అసెంబ్లీలో కేఏ పాల్ సందడి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచలన వ్యాఖ్యలు

KA Paul

Updated On : February 10, 2024 / 2:01 PM IST

Telangana Assembly : ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నవేళ పాల్ అసెంబ్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీకి వెళ్లిన పాల్.. పలువురు అధికారులు, రాజకీయ నేతలతో ముచ్చటించారు. కొద్దిసేపు అసెంబ్లీలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : Telangana Assembly Budget Session 2024 : 2లక్షల75వేల 891 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఆరు గ్యారంటీల అమలుకు కేటాయింపులు ఎన్నంటే?

కేఏ పాల్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, ఆయన వచ్చాక తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మారుతుందని అన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారబోతుందని, రేవంత్ తో కలిసి ప్రపంచంలోని బిలియనీర్స్ ను కలిసి పెట్టుబడులు తెస్తామని పాల్ అన్నారు. ఇటీవల రేవంత్ విదేశాలకు వెళ్లిన సమయంలో రేవంత్ ఇంగ్లీష్ పై పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావించిన పాల్.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు కూడా ఇంగ్లీష్ రాదు. అయినా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. రేవంత్ ఇంగ్లీష్ పై విమర్శలు చేయడం తెలివి తక్కువవాళ్లు చేసే పనిఅని పాల్ అన్నారు.

Also Read : Vijayashanti : ఎన్టీఆర్‌కూ భారతరత్న ప్రకటించాలి.. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలి

మాజీ సీఎం కేసీఆర్ పాలనలో 12లక్షల కోట్ల అవినీతి జరిగిందని పాల్ విమర్శించారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎక్కడ నుంచి మీరు పోటీ చేస్తారని ప్రశ్నించగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని పాల్ అన్నారు. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ వేస్ట్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 10లక్షల కోట్ల అప్పు చేశారంటూ పాల్ విమర్శించారు.