Masab tank flyover
Oil drums fell : హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో టస్కర్ వాహనంలో నుంచి ఆయిల్ డ్రమ్ములు కిందపడిపోయాయి. దీంతో రోడ్డు మొత్తం ఆయిల్ విస్తరించింది. మెహదీపట్నం నుండి మాసాబ్ ట్యాంక్ మీదుగా టస్కర్ వాహనం ఆయిల్ ద్రమ్ములతో వెళుతోంది.
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైకి వెళ్తోన్న సమయంలో ఆయిల్ డ్రమ్ములు కిందపడ్డాయి. దీంతో ఆయిల్ రోడ్డు మొత్తం విస్తరించింది. కిందపడిన ఆయిల్ ను గమనించకపోవడంతో వాహన దారులు స్కిడ్ అయ్యి పడిపోయారు. మొత్తం కింద నాలుగు డ్రమ్ములు రోడ్డుపై పడి పోయాయి.
Madhya Pradesh : ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు.. 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన చిన్నారి
ఒక్కో డ్రమ్ 800 లీటర్ల సామర్థ్యం కలిగివుంది. అప్పటికే భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల మేర వాహనాల ఆగిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై సుమారు 50 ట్రిప్పుల మట్టిని జిహెచ్ఎంసి సిబ్బంది పోశారు. రోడ్డుపై మట్టి పోసి ట్రాఫిక్ పోలీసులు.. వాహన రాకపోకలను పునరుద్ధరించారు.