Oil Leak : హైదరాబాద్ నాగారంలో ఆయిల్ ట్యాంకర్ లీక్.. 40 మందికి గాయాలు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Oil Leak : హైదరాబాద్ నాగారంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయ్యింది. రోడ్డుపై ఆయిల్ పడటంతో ఆ మార్గం నుంచి వెళ్తున్న వాహనాలు స్కిడ్ అయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలు జారిపడ్డాయి. సుమారు 40 మంది వరకు గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

అటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. రోడ్డు మీద పడిన ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. త్వరితగతిన ఆయిల్ ను క్లీన్ చేసే పనిలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు.

 

Also Read : రాజకీయాలకు బ్రేక్.. ఇంట్రెస్టింగ్‌గా కేటీఆర్ ట్వీట్.. ఇక కవిత మరింత యాక్టివ్ అవుతారా?