KTR: రాజకీయాలకు బ్రేక్.. ఇంట్రెస్టింగ్‌గా కేటీఆర్ ట్వీట్.. ఇక కవిత మరింత యాక్టివ్ అవుతారా?

కేటీఆర్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఏంటి? ఉన్నట్లుండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది.

KTR: రాజకీయాలకు బ్రేక్.. ఇంట్రెస్టింగ్‌గా కేటీఆర్ ట్వీట్.. ఇక కవిత మరింత యాక్టివ్ అవుతారా?

KTR

Updated On : November 30, 2024 / 9:42 PM IST

షార్ట్ బ్రేక్ తీసుకుందాం.. మళ్లీ కలుద్దామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. చిన్న విరామం తీసుకుని రిఫ్రెష్ అయ్యి వస్తానంటున్నారు కేటీఆర్. తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని తనరాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్సవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ స్మయిలింగ్ ఎమోజీని కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతుండగా..అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.

కేటీఆర్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఏంటి.? ఉన్నట్లుండి అంతా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటూ చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకున్నారు.? ఆయన ఎక్కడికి వెళ్తున్నారు.? రిఫ్రెష్ కోసమే అయితే ట్వీట్ ఎందుకు చేస్తారు.? పొలిటికల్గా యాక్టివ్గా లేకున్నా ప్రత్యర్థులు తనను మిస్ కాలేరేమోనని ఎందుకు అంటున్నారు.? కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కవిత యాక్ట్ కాబోతున్నారా.? అసలు బీఆర్ఎస్ వ్యూహమేంటి.? కేటీఆర్ బ్రేక్ ఏంటి..ఇప్పుడిదే అంశంపై ఇటు గులాబీ పార్టీలో అటు అధికార కాంగ్రెస్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఎందుకు బ్రేక్?
వరుస పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటూ..అధికార పార్టీని కార్నర్ చేస్తూ వస్తున్న కేటీఆర్ ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ రామన్న ఎటు వెళ్తున్నారు..బ్రేక్ తీసుకునేది రిలీఫ్ కావడం కోసమేనా..ఇంకేదైనా వ్యూహం ఉందా అని బీఆర్ఎస్ పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఒకవేళ కేటీఆర్ బ్రేక్ తీసుకుంటున్నది కాస్త రిఫ్రెష్ కావడానికైనా..ఏదో వ్యూహం ఉండే ఉంటుందని అటు కాంగ్రెస్..ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ అవుతోందట. కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ కొన్నాళ్లుగా కామ్ గా ఉండాలని భావిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏం నష్టపోయారో ప్రచారం చేస్తామంటూ బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటోంది. ఇలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ ట్వీట్ లీడర్లు, క్యాడర్ కు షాక్కు గురి చేసిందట. ఇన్నాళ్లు మీటింగ్లు, ప్రెస్మీట్లు, సోషల్ మీడియాలో సెటైర్లు, కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కేటీఆర్ ఆల్ ఆఫ్ సడెన్గా ఈ విరామం ప్రకటించడం వెనుక మతలబు ఏంటనే చర్చను తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

గులాబీ బాస్ ప్లాన్?
కేటీఆర్ సడెన్గా బ్రేక్ తీసుకోవడం వెనుక వ్యక్తిగత వ్యవహారమేనా లేక మరేదైనా పొలిటికల్ రీజన్ ఉందా అనేది డిస్కషన్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే టాక్ కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత ఈ మధ్యే పొలిటికల్గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రాబోయే రోజుల్లో కవిత సెంట్రిక్ గా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

అందుకే కేటీఆర్ షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నారని..ఆయన తిరిగి వచ్చేవరకు కవిత, హరీశ్రావు ఇద్దరు పార్టీ యాక్టివిటీని నడిపిస్తారని అంటున్నారు. అప్పటివరకు కవిత కూడా లైమ్లైట్లో ఉంటూ వస్తారని..కేటీఆర్ రిలీఫ్ అయి వచ్చాక కేటీఆర్, కవిత, హరీశ్ రావు ముగ్గురు మరింత పార్టీ కార్యక్రమాలు, అధికార పార్టీపై పోరులో దూకుడు పెంచుతారని అంటున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు. అయితే ఆయన షార్ట్ వెకేషన్ కోసం కేరళ వెళ్లారని…రెండు మూడు రోజుల్లోనే మళ్లీ రంగంలోకి దిగుతారంటున్నారు కేటీఆర్ సన్నిహితులు

కేటీఆర్ ఒక్క ట్వీట్ ఇలా వంద ప్రశ్నలు..ఎన్నో ఊహాగానాలకు తావు ఇస్తోంది. ఆయన రిఫ్రెష్ కావడానికే బ్రేక్ తీసుకుంటున్నా..సమ్థింగ్ ఈజ్ దేర్ అని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడాలి మరి కేటీఆర్ బ్రేక్ ఎన్నిరోజులు తీసుకుంటారు.. ఆ తర్వాత బీఆర్ఎస్ యాక్టివటీ ఎలా ఉండబోతుందనేది.

YS Jagan: సంక్రాంతి తర్వాత క్యాడర్‌తోనే తానంటున్న జగన్.. ఎందుకంటే?