Omicron Varinat: గాంధీలో ఒమిక్రాన్ జీనోమ్ పరీక్షలు.. రిజల్ట్స్ అన్నీ నెగెటివ్
రాష్ట్రాల వారీగా తెలంగాణ ఇందులో మూడో స్థానంలో ఉండటంతో రాజధాని హైదరాబాద్ లో ఉన్న గాంధీలోనూ పరీక్షలు మొదలుపెట్టారు. 2 రోజులు క్రితం గాంధీ ఆస్పత్రి కేంద్రంగా ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్

Gandhi Hospital
Omicron Varinat: ప్రపంచదేశాల్లో అల్లకల్లోలంగా మారిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇండియాలోనూ 2వందలకు మించి నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా తెలంగాణ ఇందులో మూడో స్థానంలో ఉండటంతో రాజధాని హైదరాబాద్ లో ఉన్న గాంధీలోనూ పరీక్షలు మొదలుపెట్టారు. 2 రోజులు క్రితం గాంధీ ఆస్పత్రి కేంద్రంగా ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేస్తున్నారు.
ప్రత్యేక కిట్లు తెప్పించిన ప్రభుత్వం.. మొదటి బ్యాచ్ కింద 48 శాంపిల్స్ పరీక్ష జరిపింది. గాంధీ ఆసుపత్రిలో మొదటి సారి చేసిన జీనోమ్ సీక్వెన్స్‌లో అన్ని శాంపిల్స్ నెగటివ్ ఫలితాలను ఇచ్చాయి. అన్ని కేసుల్లోనూ డెల్టా వేరియంట్ ఆనవాళ్లే ఉన్నాయని గుర్తించారు.
ఇతర కేంద్రాల్లో చేసిన ఫలితాల ఆధారంగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలోనూ ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు అధికారులు. ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.
rEAD aLSO : తెలంగాణలో ఫస్ట్ టైం ఒమిక్రాన్ కారణంగా గ్రామంలో లాక్ డౌన్