MLC election results : ప్రొఫెసర్ల ఓటర్లే కీలకం, ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే మెజార్టీ!

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

Telangana MLC : తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా ఓట్లను లెక్కిస్తూనే ఉన్నారు. 2021, మార్చి 20వ తేదీ శనివారం నాలుగో రోజు ఉత్కంఠగా కొనసాగుతోంది. హైదరాబాద్, నల్గొండ పట్టభద్రుల స్థానాల్లో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లపైనే అందరీ ఫోకస్ నెలకొంది. హైదరాబాద్ లో ప్రొ.కె.నాగేశ్వర్, నల్గొండలో ప్రొ.కోదండరామ్ కు తొలి ప్రాధాన్యత ఓట్లు వేసిన ఓటర్లు..రెండో ప్రాధాన్యత ఎవరికీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది.

నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 67 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయ్యింది. రెండో ప్రాధాన్య ఓట్లలో ఎవరు పై చేయి సాధిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి 11, 799 ఓట్లు, తీన్మార్ మల్లన్న 15, 817 ఓట్లు, కోదండరామ్ కు 19 వేల 335 ఎలిమినేషన్ ఓట్లను బదిలీ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి..తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 23 వేల 432 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా..పల్లాకు 1, 22, 639 ఓట్లు రాగా..తీన్మార్ మల్లన్న కు 99 వేల 207 ఓట్లు వచ్చాయి. ఇక ప్రొ.కోదండరామ్ కు 89 వేల 407, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 44 వేల 010 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రొ. కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ స్థానంలో ఇప్పటి వరకు మొత్తం 93 మంది అభ్యర్థుల్లో 90 మంది ఎలిమినేషన్ అయ్యారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 15 వేల 321 ఎలిమినేషన్ ఓట్లు రాగా..బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావుకు 14 వేల 530 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రొ.నాగేశ్వర్ 13 వేల 773 చొప్పున ఓట్లు వచ్చాయి. మొత్తంగా..వాణీదేవికి 1, 28, 010 ఓట్లు రాగా..రాంచంద్రారావుకు 1, 19, 198 ఓట్లు, కె.నాగేశ్వర్ కు 67 వేల 383 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ప్రొ.కె.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. విజయం సాధించాలంటే..1, 68, 520 ఓట్లు రావాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు