Pailla Shekar Reddy: ఐటీ దాడుల తర్వాత తొలిసారి భువనగిరికి పైళ్ల శేఖర్ రెడ్డి.. ఘన స్వాగతం, భారీ ర్యాలీ.. ఆయన ఏమన్నారంటే?

గత బుధవారం ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు.

Pailla Shekar Reddy

Pailla Shekar Reddy – IT: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదాయ పన్ను శాఖ (Income Tax) దాడుల తర్వాత మొదటిసారి యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడారు. తనకు గత బుధవారం ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. తన నివాసంలో సోదాలు జరిగాయని అన్నారు. ఐటీ అధికారులు అనేక అనుమానాలతో సోదాలు చేశారని, అయితే, అక్రమ ఆస్తులు దొరకలేదని చెప్పారు. తన మామ ఇంట్లో సోదాలు జరిగాయని వచ్చిన ప్రచారంలో అవాస్తవమని తెలిపారు.

సౌత్ ఆఫ్రికా మైనింగ్ అబద్ధమని, దానిలో ఉన్న రాజకీయ కోణాన్ని తాను చెప్పలేనని పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. తన గురించి అనేక విధాలుగా అసత్య ప్రచారం జరిగిందని చెప్పారు. వాటిని తాను ఖండిస్తున్నానని అన్నారు. ఐటీ దాడులు వ్యపార సంబంధిత అంశమని తెలిపారు. రాజకీయ కుట్రను తాను మాట్లాడలేనని చెప్పారు.

తన ఇంట్లో ఐటీ అధికారులు దస్తావేజులు పరిశీలించారని, వారికి అన్ని రకాలుగా సహకరించానని పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సౌత్ ఆఫ్రికాలో తనకు చెందిన మైన్స్ ఉన్నాయంటూ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కొందరు తనకున్న పేరును చెడగొట్టడానికే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.

GVL Narasimha Rao : రాష్ట్రంలో ప్రమాదకర స్థితిలో శాంతిభద్రతలు : ఎంపీ జీవీఎల్