Vanama Raghavendra : అవును.. రామకృష్ణ ఆత్మహత్యకు నేనే కారణం.. తప్పు ఒప్పుకున్న వనమా రాఘవేంద్ర

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణం అంటూ వనమా రాఘవేంద్ర ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాఘవేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కేసుకి సంబంధించి..

Vanama Raghavendra : తెలంగాణలో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణం అంటూ వనమా రాఘవేంద్ర ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాఘవేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించామని చెప్పారు.

iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

”రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు వనమా రాఘవే కారణం. వారి ఆత్మహత్యకు తానే కారణమని వనమా రాఘవేంద్ర ఒప్పుకున్నాడు. కేసుకి సంబంధించి పూర్తి సమాచారం సేకరించాము. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో రాఘవేంద్రపై ఆరోపణలు చేశారు. దమ్మపేట మండలం మంగళపల్లిలో రాఘవేంద్రను కస్టడీలోకి తీసుకున్నాం. 8 ప్రత్యేక బృందాలతో వనమా రాఘవ కోసం గాలించాము” అని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటునన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్మపేట మండ‌లం మందలపల్లి దగ్గర రాఘవతో పాటు అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

ఈ కేసు గురించి పాల్వంచ‌ ఏఎస్పీ రోహిత్ రాజ్ అధికారికంగా వివ‌రాలు తెలిపారు. రాఘవను దాదాపు 10 గంట‌లు విచారించామ‌ని చెప్పారు. రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్లు వ‌న‌మా రాఘ‌వ అంగీక‌రించాడ‌ని ఆయ‌న తెలిపారు. ఈ నెల 3న పాత పాల్వంచ‌లో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌న్నారు. రామ‌కృష్ణ దంప‌తు‌లు, ఇద్ద‌రు కుమార్తెలు మృతి చెందార‌ని తెలిపారు. భార్య‌, కుమార్తెల‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన రామకృష్ణ, తను కూడా నిప్పు అంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వివ‌రించారు. రామ‌కృష్ణ బావ‌మ‌రిది జ‌నార్ద‌న్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశామ‌ని ఏఎస్పీ వెల్లడించారు.

తన ఆత్మ‌హ‌త్య‌కు ఆర్థిక ఇబ్బందులు, ఇత‌ర కార‌ణాలు ఉన్నాయ‌ని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పారు. త‌న భార్య‌ను కూడా రాఘవేంద్ర ఆశించాడ‌ని వీడియోలో తెలిపాడు. రాఘవను ప్రాథమికంగా విచారించిన అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వనమా రాఘవేంద్రకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రాఘవను భద్రాచలం జైలుకి తరలించారు పోలీసులు.

ట్రెండింగ్ వార్తలు