WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

వాట్సాప్ నుంచి త్వరలో ఫ్యూచర్ అప్‌డేట్ రాబోతోంది. వాట్సాప్ చాట్ బాక్సులో రెండు ఆప్షన్లను ఎత్తేయనుంది. వాట్సాప్ చాట్ లిస్టులో కనిపించే ఈ రెండు ఆప్షన్లను ఎత్తేయనుంది.

WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!

Whatsapp May Do Away With Broadcast List And New Group From Chat List In Future Update

WhatsApp Update : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో ఫ్యూచర్ అప్‌డేట్ రాబోతోంది. వాట్సాప్ చాట్ బాక్సులో రెండు ఆప్షన్లను ఎత్తేయనుంది. వాట్సాప్ చాట్ లిస్టులో కనిపించే Broadcast List, New Group అనే రెండు ఆప్షన్లను తొలగించనుంది. భవిష్యత్తులో చాట్ జాబితాలో ఈ ఆప్షన్లు కనిపించవు. మీరు మెసేజింగ్ యాప్‌ ఓపెన్ చేసినప్పుడు.. చాట్ స్క్రీన్‌కు టాప్ కార్నర్‌లో రెండువైపులా బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ (Boradcast List), New Group ఆప్షన్లు కనిపిస్తాయి. రాబోయే ఫ్యూచర్ అప్‌డేట్‌లో వాట్సాప్ తొలగించవచ్చు.

వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ Wabetainfo ప్రకారం.. WhatsApp Archive చేసిన జాబితా మాత్రమే చాట్ స్క్రీన్ టాప్‌లో కనిపించేలా వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. కొన్ని నిర్ధిష్టమైన UI ఎలిమెంట్‌లను తొలగించనుందని వెల్లడించింది. బ్రాడ్‌కాస్ట్ లిస్ట్, కొత్త గ్రూప్ ఆప్షన్లతో యూజర్లకు సింగిల్ ట్యాప్‌తో గ్రూప్‌ క్రియేట్ చేయడం లేదా మెసేజ్‌లు పంపుకునే వీలుంది. WhatsApp ఇప్పుడు చాట్ స్క్రీన్‌ను డీ-క్లట్టర్ క్లీన్ చేస్తోంది. Wabetanifo షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌.. అప్‌డేట్ టాప్ స్క్రీన్‌లో Archive చేసిన చాట్ ఆప్షన్ మాత్రమే చూపుతుంది.

మీ కాంటాక్టుల లిస్టులో “Broadcast” కు కొత్త ఎంట్రీ పాయింట్ ఉంటుంది. టాప్ రైడ్ సైడ్‌లో Start New Chat కనిపించే బటన్ Press చేయాలి. కొత్త గ్రూప్ ఆప్షన్లతో ఇలాంటి సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో మాత్రమే ఈ కొత్త మార్పులను రిలీజ్ చేయనుంది వాట్సాప్. ఈ ఫీచర్‌ ఎప్పుడైనా రిలీజ్ చేస్తుందో లేదో క్లారిటీ లేదు. UIలో మార్పులు మాత్రం ప్రస్తుతం డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉంది. కొత్త ఫీచర్ రిలీజ్‌కు ముందు మార్పులు చేయాలని వాట్సాప్ భావిస్తోంది.

ఇప్పటికే.. నోటిఫికేషన్‌ ప్యానెల్‌లో యూజర్ల ప్రొఫైల్ ఫొటో కనిపించే కొత్త ఫీచర్‌ను WhatsApp టెస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా.. మెసేజింగ్ యాప్ iOS బీటా యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీరు చాట్‌లు గ్రూప్‌ల నుంచి కొత్త మెసేజ్‌లను తీసుకున్నప్పుడు.. నోటిఫికేషన్‌లలో ప్రొఫైల్ ఫోటోలను మార్చేందుకు WhatsApp అనుమతించనుంది. iOS 15 APIల ద్వారాఈ ఫీచర్ కొన్ని బీటా టెస్టర్‌లకు iOS 15లో మాత్రమే రిలీజ్ చేసినట్టు నివేదిక పేర్కొంది. ఆ తర్వాత రెగ్యులర్ వాట్సాప్ అకౌంట్ యూజర్లకు కూడా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్ టెస్టింగ్‌లో ఉంది.

Read Also : iPhone 12 Series : ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు.. రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!