Kushaiguda Incident : అమానుషం.. అపార్ట్‌మెంట్ నుంచి పసికందును విసిరేసిన తల్లిదండ్రులు

హైదరాబాద్ కుషాయిగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాతృత్వానికే మచ్చ తెచ్చే దారుణం ఇది. నవమోసాలు మోసి శిశువును కన్న ఆ తల్లి పసికందును వద్దనుకుంది. లోకం పోకడ తెలియని ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా ఓ అపార్ట్ మెంట్ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు.

Kushaiguda Incident : హైదరాబాద్ కుషాయిగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాతృత్వానికే మచ్చ తెచ్చే దారుణం ఇది. నవమోసాలు మోసి శిశువును కన్న ఆ తల్లి పసికందును వద్దనుకుంది. లోకం పోకడ తెలియని ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా ఓ అపార్ట్ మెంట్ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియా కమలానగర్ లో జరిగింది.

Also Read..Rajasthan Girls: అమానుషం.. రాజస్థాన్‌లో అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం.. మానవ హక్కుల కమిషన్ సీరియస్

అపార్ట్ మెంట్ లోని అంతస్తు నుంచి కిందకు ఒక్కసారిగా పడేయటంతో సిమెంట్ గచ్చుకు బలంగా తగలడంతో గుక్కపెట్టి ఏడ్చిన పసికందును చూసి చలించిపోయారు అపార్ట్ మెంట్ వాసులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 108 కు ఫోన్ చేసి అపార్ట్ మెంట్ కు చేరుకున్న కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్.. ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ పసికందును చేతుల్లోకి తీసుకుని అంబులెన్స్ లోకి ఎక్కించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన పసికందుకు ప్రాథమిక చికిత్స చేశాక మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

Father Killed Daughter : అతిగా ఫోన్ మాట్లాడుతుందని.. కూతురును హత్య చేసిన తండ్రి

ప్రాణాలతో ఉన్న పసికందును నిర్దాక్షిణ్యంగా అపార్ట్ మెంట్ నుంచి విసిరేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాళ్లసలు తల్లిదండ్రులేనా? అని స్థానికులు మండిపడుతున్నారు. లోకం పోకడ ఎరుగని పసికందును అలా ఎలా విసిరేశారో అర్థం కావడం లేదంటున్నారు. ఆ కసాయి తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పసికందును విసిరేసిన తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు విసిరేశారు? కారణం ఏంటి? ఎందుకింత నిర్దయగా వ్యవహరించారు? అని తెలుసుకునే పనిలో పడ్డారు.