Rajasthan Girls: అమానుషం.. రాజస్థాన్‌లో అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం.. మానవ హక్కుల కమిషన్ సీరియస్

రాజస్థాన్‌లో అప్పు తీర్చకపోతే ఆ ఇంటి ఆడబిడ్డల్ని వేలం వేస్తున్నారు. 8-18 ఏళ్ల బాలికల్ని విక్రయిస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే, అతడి భార్యపై అత్యాచారం చేస్తున్నారు. ఈ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

Rajasthan Girls: అమానుషం.. రాజస్థాన్‌లో అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం.. మానవ హక్కుల కమిషన్ సీరియస్

Rajasthan Girls: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. కుటుంబ పెద్ద అప్పు తీర్చలేదని, ఆ కుటుంబాలకు చెందిన అమ్మాయిల్ని వేలం వేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దాదాపు ఆరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

ఈ ప్రాంతంలో రెండు కుటుంబాలు లేదా వర్గాల మధ్య గొడవలు తలెత్తితే స్థానిక పంచాయితీల (గ్రామ పెద్దలు లేదా కుల పెద్దలు)ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు లేదా అప్పు విషయంలో పోలీసుల్ని ఆశ్రయించకుండా పంచాయితీల వద్దకు వెళ్తున్నారు. ఇక్కడ పెద్దలు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ పెద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ కుటుంబానికి చెందిన ఆస్తుల్ని వేలం వేస్తున్నారు. అలాగే 8-18 ఏళ్ల వయసు కలిగిన బాలికల్ని వేలంలో అమ్మేస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకోకుంటే అప్పు తీసుకున్న వారి భార్యపై అత్యాచారం చేస్తున్నారు. ఒకవేళ అమ్మాయిల విక్రయం ద్వారా కావాల్సినంత డబ్బు సమకూరకపోయినా ఇదే పని చేస్తున్నారు.

Mahindra XUV400: ఎలక్ట్రిక్ కార్ల కోసం మహీంద్రా సంస్థ కొత్త ప్లాన్… చార్జింగ్ పాయింట్ల కోసం చార్జ్+జోన్ సంస్థతో డీల్

దీనికి సంబంధించి స్టాంప్ పేపర్ల మీద ఒప్పందం జరగడం మరో విశేషం. ఇలా వేలంపాటలో విక్రయించిన అమ్మాయిల్ని ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ముంబై, ఢిల్లీతోపాటు కొన్నిసార్లు విదేశాలకు కూడా తరలిస్తున్నారు. అక్కడ వీరితో అన్ని పనులు చేయించడంతోపాటు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వేశ్యలుగా, బానిసలుగా మారుస్తున్నారు. భౌతిక దాడులు చేస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి రూ.15 లక్షల అప్పు తీర్చలేకపోయాడు. దీంతో అతడిపై పంచాయితీ నిర్వహించారు. ముందుగా అతడి చెల్లిని వేలం వేశారు. అప్పటికీ అప్పు తీరలేదు. దీంతో రెండోసారి అతడి 12 ఏళ్ల కూతురును వేలం వేశారు. ఈ బాలికను ఒక వ్యక్తి రూ.8 లక్షలకు కొనుక్కున్నాడు. అప్పటికీ అప్పు తీరకపోవడంతో తన ఐదుగురు చెల్లెళ్లను విక్రయించాడు. అయినప్పటికీ అతడు అప్పు పూర్తిగా తీరలేదు. మరో ఘటనలో ఒక వ్యక్తి తన భార్య చికిత్స కోసం రూ.6 లక్షలు అప్పు తీసుకున్నాడు.

Household Work: కుటుంబం కోసం ఇంటి పనులు చేయమనడం హింస కాదు.. బాంబే హైకోర్టు వ్యాఖ్య

తర్వాత ఆమె చనిపోయింది. తర్వాత అతడి తల్లి చికిత్స కోసం మరో రూ.6 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చేందుకు అతడు తన కూతురును రూ.6 లక్షలకు అమ్మేశాడు. అప్పటికీ అతడి అప్పు తీరలేదు. ఆ అమ్మాయిని కొనుక్కున్న వాళ్లు తనను ఆగ్రా తీసుకెళ్లారు. కొంతకాలం తర్వాత ఆమె తిరిగొచ్చింది. ఇలా మూడుసార్లు ఆమెను అమ్మేశారు. ఈ క్రమంలో ఆమె నాలుగుసార్లు గర్భం దాల్చింది. ఇలాంటి దారుణ ఘటనలు వెలుగు చూడటంతో కేంద్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారని, ఎలాంటి కేసులు నమోదు చేశారని ప్రశ్నించింది. అమ్మాయిల భద్రత విషయంలో ఏం చేస్తున్నారని అడిగింది. నాలుగు వారాల్లోగా ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.