Household Work: కుటుంబం కోసం ఇంటి పనులు చేయమనడం హింస కాదు.. బాంబే హైకోర్టు వ్యాఖ్య

భార్యతో ఇంటి పనులు చేయించే విషయంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబం కోసం ఇంటి పనులు చేయాలి అని చెప్పడం హింస కిందకు రాదని వ్యాఖ్యానించింది. తనను భర్త, అతడి కుటుంబ సభ్యులు ఇంటి పనులు చేయాలి అంటూ వేధించారని ఒక మహిళ చేసిన ఫిర్యాదు సందర్భంగా కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.

Household Work: కుటుంబం కోసం ఇంటి పనులు చేయమనడం హింస కాదు.. బాంబే హైకోర్టు వ్యాఖ్య

Household Work: కుటుంబం కోసం భార్యను ఇంటి పనులు చేయాలి అని చెప్పినంత మాత్రాన అది హింస కిందకు రాదని అభిప్రాయపడింది బాంబే హైకోర్టు. ఇంటి పనులు చేయాలి అంటూ తన భర్త, అతడి తల్లిదండ్రులు తనను వేధించారంటూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Tamil Nadu: ప్రమాదంలో గాయపడి బాలిక మృతి.. అంత్యక్రియల తర్వాత సమాధిలోంచి బాలిక తల మాయం

జస్టిస్ విభా కంకన్‌వాడి, రాజేష్ పాటిల్‌తో కూడిన ఔరంగాబాద్ బెంచ్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితం ఒక మహిళ తన భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. వాళ్లు రోజూ తనను ఇంటి పనులు చేయాలి అంటూ వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లైన మొదటి నెల వరకు బాగానే చూసుకున్నారని, ఆ తర్వాత నుంచి ఇంటి పనులు చేయమని చెప్పేవారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఫోర్ వీలర్ కొనుక్కునేందుకు అదనపు కట్నంగా రూ.4 లక్షలు తేవాలని కూడా వేధించారని పేర్కొంది. తనను మానసికంగా, శారీరకంగా హింసించారని, తనను పని మనిషిలా చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపి, తాజాగా తీర్పు ఇచ్చింది. మహిళ ఫిర్యాదును కొట్టివేసింది.

Indian Airfield: చైనాకు భారత్ కౌంటర్‌.. యుద్ధక్షేత్రంలో ఉపయోగపడేలా లదాఖ్‌లో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక మహిళను కుటుంబం కోసం ఇంటి పనులు చేయాలి అని చెప్పినంత మాత్రాన దాన్ని హింసగా పరిగణించలేం. అలాగే ఆ పనులు చేస్త.. సేవకురాలిగానో, పని మనిషిగానో చూస్తున్నట్లు కాదు. ఒకవేళ భర్త, అతడి కుటుంబం చెప్పిన పనులు చేయడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని భర్తకు చెప్పాలి. అప్పుడు అతడు ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటాడు. తనతో పని చేయించాలా.. లేదా పెళ్లిని రద్దు చేసుకోవాలా అని నిర్ణయించుకుంటాడు. త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఇదే కేసులో తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని పేర్కొన్నప్పటికీ, దాన్ని స్పష్టంగా పేర్కోలేదని, మొదటి ఫిర్యాదులో ఈ విషయం లేదని.. అందువల్ల ఈ విషయంలో చర్యలు తీసుకోలేమని కోర్టు చెప్పింది. ఇప్పటికే ఆ మహిళ భర్తకు, అతడి కుటుంబానికి దూరంగా ఉంటోంది.