Mahindra XUV400: ఎలక్ట్రిక్ కార్ల కోసం మహీంద్రా సంస్థ కొత్త ప్లాన్… చార్జింగ్ పాయింట్ల కోసం చార్జ్+జోన్ సంస్థతో డీల్

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఉన్న ఇబ్బంది ఛార్జింగ్. అందుకే ఈ అంశంపై దృష్టిపెట్టిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. చార్జింగ్ సంస్థ అయిన చార్జ్+జోన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Mahindra XUV400: ఎలక్ట్రిక్ కార్ల కోసం మహీంద్రా సంస్థ కొత్త ప్లాన్… చార్జింగ్ పాయింట్ల కోసం చార్జ్+జోన్ సంస్థతో డీల్

Mahindra XUV400: భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అనే సంగతి తెలిసిందే. అందుకే అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) తయారీపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశంలో టాటా నుంచి ఎలక్ట్రిక్ కారు విడుదలై, మార్కెట్లో దూసుకెళ్తోంది. త్వరలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కూడా ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేయనుంది.

Tamil Nadu: ప్రమాదంలో గాయపడి బాలిక మృతి.. అంత్యక్రియల తర్వాత సమాధిలోంచి బాలిక తల మాయం

‘ఎక్స్‌యూవీ400’ పేరుతో ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వాహనాన్ని విడుదల చేయబోతుంది. వచ్చే జనవరి నుంచి ఈ వాహనం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు మరిన్ని ప్రీమియమ్ ఎలక్ట్రిక్ వాహనాల్ని కూడా కంపెనీ విడుదల చేయబోతుంది. ముందుగా విడుదల కానున్న ‘ఎక్స్‌యూవీ400’.. 39.4 కిలో వాట్స్ లిథియమ్ అయాన్ బ్యాటరీతో రూపొందుతోంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ వాహనం 8.3 సెకండ్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మరెన్నో ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న ప్రధాన సమస్య ఛార్జింగ్. దేశంలో ఇప్పుడిప్పుడే ఈ వాహనాల వాడకం ఊపందుకుంటున్నప్పటికీ, దీనికి తగ్గట్లుగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు మాత్రం లేదు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం, వాడకానికి ఇబ్బంది.

Indian Airfield: చైనాకు భారత్ కౌంటర్‌.. యుద్ధక్షేత్రంలో ఉపయోగపడేలా లదాఖ్‌లో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం

అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీలు వివిధ మార్గాల్ని అణ్వేషిస్తున్నాయి. దీనిలో భాగంగా ఈవీల ఛార్జింగ్ కంపెనీ అయిన చార్జ్+జోన్ అనే సంస్థతో మహీంద్రా అండ్ మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా దేశంలోని 25 ప్రధాన నగరాల్లో ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీ మొత్తం దేశవ్యాప్తంగా 25,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతుంది. అందుకే మహీంద్రా కంపెనీ తన కస్టమర్ల కోసం ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా చార్జింగ్ చేసుకోవడంతోపాటు, వాహనాలకు సంబంధించిన ఇతర సేవలు కూడా అందుతాయని మహీంద్రా సంస్థ తెలిపింది. వాహనాల రిపేర్లు, విడిభాగాలు మొదలైన సేవల్ని కూడా పొందవచ్చు.