Viral Video
Viral Video : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన మహాలక్ష్మి ఫ్రీ బస్సు జర్నీ పథకం మహిళలకు వరంగా మారింది. డిసెంబర్ 9 నుండి అమలులోకి వచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే విపరీతమైన రద్దీ పెరిగిపోవడంతో ఈ పథకం కాస్తా కండక్టర్లకు చిక్కులు తెచ్చిపెడుతోంది. విపరీతమైన రద్దీలో కొందరు ప్రయాణికులు గొడవలు పడటం.. మాట వినకపోవడం కండక్టర్లకు కష్టాలు తెచ్చిపెడుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఫ్రీ బస్సు జర్నీ పథకంతో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. పల్లె వెలుగు బస్సులు.. సిటీలోని మెట్రో సర్వీసు బస్సులన్నీ జనాలతో నిండిపోతున్నాయి. ఈ జనాల రద్దీతోనే అసలు గొడవ మొదలవుతోంది. బస్సులో ఖాళీ లేకపోయినా కొందరు ప్రయాణికులు మాట వినకుండా బస్సు ఎక్కడం వల్ల తోపులాటలు జరుగుతున్నాయి. కొందరు బస్సు డోర్లు, మెట్ల వద్ద వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్లు హెచ్చరిస్తున్న ఎవరూ వినే పరిస్థితుల్లో ఉండటం లేదు. దీంతో ఫ్రీ బస్సు జర్నీ పథకం వారికి కష్టాలు తెచ్చిపెట్టింది.
క్రిక్కిరిసిన బస్సులో ఫుట్ బోర్డ్‌పై ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలిసిందే. జరగరానిది జరిగితే ముందుగా డ్రైవర్, కండక్టర్లపై చర్యలు ఉంటాయి. అందుకే పదే పదే చెబుతున్నా వారి మాట ప్రయాణికులు చెవికెక్కడం లేదు. ఇటీవల గుర్తింపు కార్డు విషయంలో తగవులాటలు అనేకం చూసాము. తాజాగా భద్రాచలం డిపో బస్సులో మరో లేడీ కండక్టర్‌కి చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆ కండక్టర్ ఏడుస్తూ బస్సు దిగి వెళ్లిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భద్రాచలం డిపో బస్సు బూర్గం పాడుకి రాగానే చాలామంది మహిళలు బస్సు ఎక్కారు. ఎక్కిన వారంతా ఫుట్ బోర్డు దగ్గర వేలాడుతూ నిలబడ్డారు. అలా ప్రయాణిస్తే ప్రమాదం అని హెచ్చరిస్తున్న లేడీ కండక్టర్ మాటలు ఖాతరు చేయలేదు. సరికదా ఆమెను తిట్టడం మొదలుపెట్టారు. అంతే.. ఆ మహిళా కండక్టర్ ఎమోషనలై బస్సు దిగిపోయింది. మంచికి చెబితే మాపైనే రివర్స్ అవుతున్నారు.. ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాం.. అంటూ ఆ మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది.
మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం
ఇదిలా ఉంటే వేములవాడ బస్సులో సీటు దొరకలేదని బస్సు కింద ప్రయాణికుడు అడ్డంగా పడుకున్న వీడియో వైరల్ అవుతోంది. బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువ కావడంతో మగవారు కూర్చునే వైపు కూడా మహిళలు నిలబడుతున్నారు. దాంతో కనీసం తమకి నిలబడే చోటు కూడా ఉండటం లేదని పురుషులు గొడవకి దిగుతున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు జర్నీ పథకం మహిళా ప్రయాణికులకు సంతోషాన్ని.. సిబ్బందికి ఇబ్బందిని కలిగిస్తోంది.
ఫ్రీ బస్.. ఏడుస్తున్న కండక్టర్లు…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకంతో కండక్టర్లు కష్టాలు పడుతున్నారు. తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ… pic.twitter.com/l4CTENAySL
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023
వేములవాడ – బస్సులో సీటు లేదని బస్సు కింద అడ్డంగా పడుకున్న ప్రయాణికుడు. pic.twitter.com/qNk9qWicfv
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023