మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం

తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం

Congress Govt Telangana Mahalakshmi Scheme : తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో మహిళలు దర్జాగా ఉచితంగా బస్సుల్లో తిరిగేస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ బస్సులన్నీ మహిళా ప్రయాణీకులతో కిటకిటలాడిపోతున్నాయి. అలా ఈ పథాకాన్ని అమలులోకి తీసుకొచ్చిన 11 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో 3కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారిలో 62 శాతం మహిళలే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే మహాలక్ష్మి పథకం వల్ల మహిళల ప్రయాణాలు చేయటం పెరిగిందనే చెప్పాలి. దీంతో కేవలం 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తేలింది.

Also Read: నువ్వెంత కష్టపడ్డా కేసీఆర్ తరువాత కేటీఆరే.. నువ్వు కాదని తెలుసుకో: హరీశ్‌రావుపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు

త్వరలో 2050 కొత్త బస్సులు: సజ్జనార్
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని.. అందులో 1050 డీజిల్, 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని వెల్లడించారు. విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయని చెప్పారు.