CM Revanth Reddy : మహాలక్ష్మి పథకం రద్దు చేయాలని ఆటో డ్రైవర్ల డిమాండ్.. వారితో సమావేశంకానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఉబర్ డ్రైవర్లతో సమావేశమవ్వనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశమవ్వనున్నారు.

CM Revanth Reddy : మహాలక్ష్మి పథకం రద్దు చేయాలని ఆటో డ్రైవర్ల డిమాండ్.. వారితో సమావేశంకానున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఉబర్ డ్రైవర్లతో సమావేశమవ్వనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సాయంత్రం 4గంటలకు సమావేశమవ్వనున్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకోనున్నారు.

కాగా.. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయామని..ఇప్పటికే ఉబర్,ఓలా క్యాబ్ లతో తమకు ఉపాధి తగ్గిపోయిందని ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల మొత్తం ఉపాధి కోల్పోయామని వాపోతున్నారు.

మహిళలు ఆటోలు ఎక్కటం మానేసి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుండటంతో తామ ఉపాధి కోల్పోయామని కాబట్టి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీని కోసం ఆందోళనలు చేపట్టటమే కాకుండా ఆర్టీసీ బస్ భవన్ ను ముట్టడికి యత్నించారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లు, ఉబర్ డ్రైవర్లతో ఈరోజు సమావేశమవ్వనున్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకోనున్నారు. దీంతో తమకు మహాలక్ష్మి పథకం అమలుతో జరుగుతున్న కష్ట నష్టాలను సీఎం రేవంత్ కు తెలుపనున్నారు. మరి వారి బాధలు విని రేవంత్ ఎటువంటి భరోసాను ఇవ్వనున్నారో వేచి చూడాలి.