Pawan Kalyan : బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

Pawan Kalyan Praises Modi : దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని నాలాంటి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. ఆ కన్న కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ.

Pawan Kalyan Praises Modi

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే లీడర్ అంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు పవన్ కల్యాణ్.

”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో విజయం సాధించాం. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అందరికీ చేరాయా అన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటుంది. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోదీ అనుభవం ప్రధానిగా దేశానికి ఎంత ఉపయోగ పడుతుందో మీ అందరికీ తెలుసు. ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే.. ఆర్టికల్ 370 రద్దు చేసే వారే కాదు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసే వారు కాదు, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే వారు కాదు, రామమందిరం నిర్మించే వారు కాదు, పెద్ద నోట్లను రద్దు చేసే వారే కాదు.

Also Read : కేసీఆర్ కు అలా చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? దొంగలంతా అందులోనే ఉన్నారు

ప్రధాని మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం. ఎన్నికల ప్రయోజనాలు కాదు. మోదీ అంటే నాకెందుకు అంత గౌరవం? అంటే.. 2004 నుంచి 2014 వరకు గోకుల్ చాట్, లుంబినీ పార్క్, ముంబై దాడులు వంటివి ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బలమైన నాయకుడు కావాలి. దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని నాలాంటి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. ఆ కన్న కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ.

ఒక దేశం అభివృద్ధి కావాలంటే అంతర్గత భద్రత ఎంతో ముఖ్యం. ప్రధానిగా మోదీ వచ్చాక ఉగ్ర దాడులను ఏ విధంగా కట్టడి చేశారో మీకు తెలుసు. మా దేశం మీద దాడులు చేస్తే మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని ధైర్యంగా చెప్పి ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన లీడర్ మోదీ. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల్ యోజన, గరీబ్ కల్యాణ్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. ఆ స్కీమ్స్ ఎంతగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసు. అందుకే, మరోసారి మోదీయే ప్రధాని అవ్వాలి” అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

Also Read : వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాది.. షర్మిలను బహిష్కరిస్తున్నాం..

ట్రెండింగ్ వార్తలు