Jupalli Krishna Rao : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి : జూపల్లి కృష్ణారావు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. లక్ష్యాలు ఇంకా నెరవేరలేదన్నారు. ప్రజల కోసమే తాము నిరంతరం పోరాడుతామని చెప్పారు.

Jupalli Krishna Rao : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాలుగేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో చూస్తూనే ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో సరైన అడ్మినిస్ట్రేషన్ లేకుండా అస్తవ్యస్తంగా పరిపాలన సాగుతోందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా.. లక్ష్యాలు ఇంకా నెరవేరలేదన్నారు. ప్రజల కోసమే తాము నిరంతరం పోరాడుతామని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరుతానన్న దానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంపై తన కార్యకర్తలతో చర్చిస్తున్నానని తెలిపారు.

Vinod Kumar : ఎంపీ బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ కు, రాష్ట్రానికి ఒక్కపైసా తేలేదు : వినోద్ కుమార్

ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సభలో పాల్గొనేందుకు తాను ఖమ్మంకు వచ్చానని వెల్లడించారు. తన మిత్రుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చానని పేర్కొన్నారు. సాయంత్రం కొత్తగూడెంలో ఏమి మాట్లాడుతారో చూస్తారు కదా అంటూ వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు