Vinod Kumar : బండి సంజయ్ కేంద్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ కు, రాష్ట్రానికి ఒక్కపైసా తేలేదు : వినోద్ కుమార్

కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.

Vinod Kumar : బండి సంజయ్ కేంద్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ కు, రాష్ట్రానికి ఒక్కపైసా తేలేదు : వినోద్ కుమార్

Vinod Kumar

Vinod Kumar : బీజేపీపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శలు చేశారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడి కరీంనగర్ కు గానీ, రాష్ట్రానికి గానీ ఒక్క పైసా తెచ్చింది లేదని విమర్శించారు. తాము పెట్టిన ప్రసాద్ స్కీం కింద తెలంగాణలో ఆలయాల అభివృద్ధి కోసం పార్లమెంటులో ప్రతిపాదనలోనే ఉందన్నారు. కుటుంబ పాలన అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారు ప్రజలకు సేవ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీలో తాతలు, కొడుకులు, మనమలు ఎంపీలుగా లేరా? మాట్లాడటానికి బుద్ధి, మెదడు ఉండాలని మండిపడ్డారు.

4500 కోట్లతో వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకున్నామని వినోద్ కుమార్ తెలిపారు. మూలవాగు జీవనదిగా మార్చడం జరుగుతుందన్నారు. రూ.670 కోట్లు రైతు బంధు ఇచ్చామని పేర్కొన్నారు. ముంపు గ్రామాల త్యాగ ఫలమే మిడ్ మానేరు.. దాన్ని సముద్రముగా మార్చుకున్నామని చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరం, అక్టోబర్ నెల చివరి వరకు అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు.

Vinod Kumar : ఏబీసీడీలు తెలుసా? బండి సంజయ్ పై వినోద్ కుమార్ ఫైర్

ఇప్పటివరకు ప్రతి ప్రజాప్రతినిధులు అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లామని పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో సగటు మనిషి ఆదాయం పెరిగిందన్నారు. ఇది తాను చెప్పింది కాదని.. దీనిపై పార్లమెంట్లోనే చర్చ జరిగిందని తెలిపారు. తాము పెట్టిన ఆత్మీయ సమ్మేళనంలో అభివృద్ధి జరిగిన విషయంపై, ఇంకా జరగాల్సిన పనులపై చర్చించుకుంటున్నామని వెల్లడించారు.

మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల్లో ధీమా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు డ్యామ్ పై నుండి రోడ్డు మరియు రైల్వే బిడ్జి వేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నామని వెల్లడించారు. వేములవాడ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ టికెట్ మళ్ళీ రమేష్ బాబుకే వస్తుందని.. ఎమ్మెల్యేగా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.