Petrol Price: వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊపందుకున్నాయి. వరుసగా రెండో రోజూ వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 4 నెలలపాటు బ్రేక్ తీసుకున్న..

Petrol Price: వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

petrol diesel price hike

Updated On : March 23, 2022 / 8:05 AM IST

Petrol Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఊపందుకున్నాయి. వరుసగా రెండో రోజూ వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 4 నెలలపాటు బ్రేక్ తీసుకున్న దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభించాయి. తాజాగా బుధవారం లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్‌ ధర రూ.96.36కు చేరింది.

మంగళవారం పెట్రోలు ధర రూ.109.10, డీజిల్‌ ధర రూ.95.50గా ఉన్నాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోల్‌ రూ.97.01, డీజిల్‌ 88.27గా ఉన్నాయి. కాగా, మంగళవారం.. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసింది.

పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తుంది. గతంలో కంటే రూ.50 అధికమవడంతో హైదరాబాద్‌లో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1002కు చేరింది.

Read Also : లీటర్ పెట్రోల్ రూ.254.. ఎక్కడంటే ?