Ramagundam Fertilizer Factory : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో పైప్ లైన్ పగిలి గ్యాస్ లీక్

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది.

ramagundam

Ramagundam Fertilizer Factory : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది. గ్యాస్ లీక్ అవడంతో అధికారులు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.

ఇలా గత నాలుగు నెలల్లో మూడుసార్లు జరిగింది. ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాలతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.  పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపి వేశారు.

Gas Pipeline Leak : కృష్ణా జిల్లాలో పగిలిన గ్యాస్ పైప్‌లైన్, ఆందోళనలో స్థానికులు

రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి. యూరియా ఉత్పత్తిపైన ప్రభావం చూపుతోంది. అమ్మోనియా ప్లాంట్ లో లీకేజ్ లు ఏర్పడడం, పైప్ లైన్ లు పగిలిపోవడం కారణంగా యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది.