New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకకు ప్లాన్ వేసుకుంటున్నారా? పర్మిషన్లు తీసుకోవడానికి 21 నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నారు. సైబరాబాద్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు, ఆర్గనైజర్లు సహకరించాలని పోలీసులు అన్నారు. న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్లపై గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఐటీ కారిడార్ పరిధిలోని ఈవెంట్ ఆర్గనైజర్లు, పోలీసులతో తాజాగా సమన్వయ సమావేశం జరిగింది.
Also Read: గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. మరో 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?
ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ… వేడుకల్లో డ్రగ్స్ వాడొద్దని, ఆర్గనైజర్లు డ్రగ్స్‌కు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేడుకల్లో అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
సామర్థ్యానికి మించి ప్రజలను అనుమతించవద్దని చెప్పారు. ధ్వని కాలుష్యం తలెత్తేలా డీజే పాటలు పెట్టకూడదని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే పోలీసులు సూచనలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈవెంట్ నిర్వాహకులు వేడుకలు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులు చెప్పారు.