బాబోయ్ చలి చంపేస్తోంది.. ఈ గజ గజ ఇంకెన్నాళ్లు అనుకుంటున్నారా? వాతావరణ శాఖ ఆన్సర్ ఇదే..
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Cold Wave: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు చలికి వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
దీనికి కారణం ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులే. రానున్న మూడు రోజుల పాటు చలి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అతిశీతల గాలులు, పొగమంచు మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. (Cold Wave)
Also Read: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ పరీక్ష ఒకరోజు వాయిదా.. ఎందుకంటే?
రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అన్నారు. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
పటాన్‌చెరులో అత్యల్పంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదిలాబాద్‌లో 7.2, మెదక్‌లో 7.2, హన్మకొండలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 – 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
రానున్న మూడు రోజులు సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
