CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

CM Revanth Reddy PM Narendra Modi

CM Revanth Reddy Birthday: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెష్ తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలి’ అంటూ ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజా సేవలో మీరు ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్విటర్ లో పోస్టు చేశారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి ‘మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర’.. పూర్తి షెడ్యూల్ ఇలా…

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా నేతలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి పుట్టినరోజు కావడంతో.. కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గోనున్నారు.