సీఎం రేవంత్ రెడ్డి ‘మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర’.. పూర్తి షెడ్యూల్ ఇలా…
మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.

CM Revanth Reddy
CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది వెంట పాదయాత్ర చేసి రైతులతో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ధర్మారెడ్డి కాలువ వరకు ఆరు కిలో మీటర్ల మేర రేవంత్ పాదయాత్ర చేసి మూసీ జలాలను పరిశీలించనున్నారు. సమీపంలో పరీవాహక ప్రాంత ప్రజలతో మాటామంతీ నిర్వహించి.. సమీపంలో ఉన్న పెద్దమ్మ ఆలయం వద్ద బహిరంగ సభలో రేవంత్ మాట్లాడతారు.
షెడ్యూల్ ఇలా..
◊ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం 9గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి బయలుదేరుతారు.
◊ ఉదయం 10గంటలకు లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
◊ 11.30 గంటలకు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి పనులు, ముఖ్యంగా స్వర్ణతాపడం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు.
◊ మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వలిగొండ మండలం సంగెం గ్రామానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు.
◊ మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు.
◊ మూసీ నది వెంట ఉన్న పరివాహక ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తూ అక్కడి రైతులతో రేవంత్ ముచ్చటించనున్నారు.
◊ మూసీ వెంట రేవంత్ పాదయాత్ర సుమారు ఆరు కిలో మీటర్ల కొనసాగనుంది.
◊ భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను కూడా రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.
◊ మూడుపాయల వద్ద ఉన్న భీమలింగం స్వామిని రేవంత్ దర్శించుకోనున్నారు.
◊ మూసీ వెంట ధర్మారెడ్డి కాల్వ వరకు పాదయాత్రగా వెళ్తారు. అక్కడి నుంచి నాగిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు వైపు నడుస్తారు.
◊ పెద్దమ్మ ఆలయ వద్ద బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర#MusiSankalpYatra pic.twitter.com/ISt5SwkPVY
— Telangana Congress (@INCTelangana) November 7, 2024