PM Modi : తెలంగాణలో మూడ్రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్న ప్రధాని మోదీ .. 27న హైదరాబాద్లో భారీ రోడ్ షో

ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.

PM Modi

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ దఫా ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రచారంలో వేగం పెంచింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు పలు నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ‘ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభ’లో పాల్గొంటారు. అనంతరం ఈనెల చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడంతో పాటు హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షో మోదీ పాల్గోనున్నారు.

Also Read : PM Modi : LOCలో జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోదీ

ఈనెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 25న కరీంనగర్ సభలో, 26న నిర్మల్ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. 27న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. ఎల్బీనగర్ నుంచి పటాన్ చెరు వరకు మోదీ రోడ్ షోకు బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రనాళిక చేస్తోంది. విజయమే లక్ష్యంగా మోదీ సభలకు జన సమీకరణ చేయనుంది.

Also Read : Rajasthan: రాజస్థాన్‌ దౌసాలో దారుణం.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారంకు పాల్పడ్డ ఏఎస్ఐ.. స్థానికంగా ఉద్రిక్తత

ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పాల్గొనే ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహాసభలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగ కులస్తులు 60శాతం ఉంటారు. ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో వీరు కీలక ఓటు బ్యాంక్ గా ఉన్నారు. సుమారు ఆరుఏడు నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గం ఓట్లే అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక భూమిక పోషించనున్నాయి.