Micro Finance Case: మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం.. రమావాత్ మధు అరెస్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరిపై 60 పైగా కేసులు నమోదయ్యాయి. సీఐడీ విచారణ సాగుతున్న సమయంలో EOW లో మధుపై కేసు నమోదైంది.
Micro Finance Case: తెలంగాణలో సంచలనం రేపిన మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు రమావత్ మధు పోలీసులకు చిక్కాడు. మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ EOW లో మధుపై కేసు నమోదైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మధు అండ్ బ్యాచ్ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరిపై 60 పైగా కేసులు నమోదయ్యాయి. సీఐడీ విచారణ సాగుతున్న సమయంలో EOW లో మధుపై కేసు నమోదైంది.
కాగా మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ సింగర్ మంగ్లీ పేరు తెరపైకి వచ్చింది. మంగ్లీ పై లాయర్ సుబ్బారావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు వసూళ్ల వ్యవహారంలో మంగ్లీ ప్రమేయం ఉందని లాయర్ సుబ్బారావు అంటున్నారు. లాయర్ సుబ్బారావు ఆరోపణలపై మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆరోపణలను మంగ్లీ కొట్టిపడేశారు. మైక్రో ఫైనాన్స్ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమే అని మంగ్లీ తేల్చి చెప్పారు. లాయర్ సుబ్బారావుపై మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Also Read: మందుబాబులకు బిగ్ షాక్.. ఇకపై తాగితేనే కాదు బిల్లు చూసినా కళ్లు తిరగాల్సిందే.. భారీగా పెరగనున్న ధరలు
