Viral Video : కారుతో కానిస్టేబుల్ మీదినుంచి దూసుకెళ్లిన అగంతకుడు..

వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ పోలీసును ఆగంతుకుడు తన కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు.

Viral Video : కారుతో కానిస్టేబుల్ మీదినుంచి దూసుకెళ్లిన అగంతకుడు..

constable hit by car

Updated On : October 20, 2023 / 3:24 PM IST

Police constable hit by car : పెట్రోలింగ్ నిర్వహించే పోలీసుల నుంచి తప్పించుకోవటానికి కొంతమంది దారుణాలకు దిగుతుంటారు. పోలీసులనే భయం కూడా లేకుండా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అటువంటిదే జరిగింది హైదరాబాద్ లోని చిలకలగూడలో. బుధవారం (అక్టోబర్ 18,2023) రాత్రి సమయంలో ఏకంగా పోలీసు మీద నుంచి ఓ అగంతకుడు కారుతో దూసుకుపోయాయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ టీవీలో రికార్డు కావటంతో ఇది బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిలకలగూడ గోపాలపురం పోలిస్ స్టేషన్ పరిధిలో చిల్లరోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ పోలీసును ఆగంతుకుడు తన కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. పోలీసు కారును ఆపమన్నా కారు ఆపలేదు. వేగంగా దూసుకెళుతు పోలీసును ఢీకొట్టి అదే వేగంగా దూసుకెళ్లిపోయాడు.

టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్ గాంధీ .. జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు

ఈ వీడియోలో వాహనాలు తనిఖీలు చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా వస్తున్న వాహనాలనుఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతలో ఓ టూవీలర్ వచ్చింది. దాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఆపలేదు. కానీ అంతలోనే వేగంగా వస్తున్న కారును ఓ పోలీసులు గుర్తించి ఆపమని అడ్డుగా వెళ్లాడు. కానీ ఆ కారు ఆగలేదు. బ్యారికేడ్లను దాటుకుని కారు ముందుకు వెళ్లిపోతుండగా కానిస్టేబుల్‌ మహేశ్ కారుకు ఎదురొచ్చి ఆపమని సైగ చేశాడు. కానీ డ్రైవర్ పోలీసును ఏమాత్రం పట్టించుకోకుండా వేగం కూడా ఏమాత్రం తగ్గకుండా అతడిని కారుతో ఢీకొట్టి అంతే వేగంతో దూసుకెళ్లిపోయాడు. ఈ ఘటనతో కానిస్టేబుల్ ఎగిరిపక్కకు పడ్డాడు.

దీంతో అక్కడే ఉన్న మరో పోలీసు పరుగున వచ్చి గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అని పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుడి వివరాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం.