Gun Misfired : హైదరాబాద్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి

కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి(Osmania Hospital) తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందారు.

Gun Misfired : హైదరాబాద్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి

Gun Misfired

Updated On : August 23, 2023 / 10:13 AM IST

Gun Misfired Constable Died : హైదరాబాద్ లో(Hyderabad)  గన్ మిస్ ఫైర్(Gun Misfired) కావడంతో పోలీస్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ (Bhupathi Srikanth) మృతి చెందారు.  బుధవారం (ఆగస్టు23,2023)న హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో (Hussaini Alam police station) గన్ మిస్ ఫైర్ అవ్వడంతో శ్రీకాంత్ అనే పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయ పడ్డారు.

కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి(Osmania Hospital) తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందారు. 2018 బ్యాచ్ కు చెందిన భూపతి శ్రీకాంత్ గార్డ్ డ్యూటీకి ఇంచార్జ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకుని పడుకునే క్రమంలో చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది.

Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

దీంతో అతని చెవిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడటంతో అతన్ని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతను విధులు నిర్వహిస్తున్న పీఎస్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Gun Firing : మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. వ్యక్తిపై దుండగులు గన్ తో ఫైరింగ్

కాగా, గతంలో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనల్లో పలువురు కానిస్టేబుల్, హోంగార్డ్స్ మరణించారు. జూన్ 29,2023న హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య  తన గన్ ను శుభ్రం చేస్తున్నాడు.

ప్రమాదశవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బులెట్ అతని శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రామయ్యను అధికారులు నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయారు.