Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
అయితే.. తనను ఇంట్లోని ఓ రూమ్‌లో పెట్టి బంధించారని.. బయటకు రాకుండా రాత్రికి రాత్రే అడ్డంగా గోడ కట్టారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య కంప్లెయింట్ చేశారు.

Eknath Reddy
Pullareddy’s grandson : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తనను వేధిస్తున్నాడని.. ఇంట్లో పెట్టి బంధించారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఏక్‌నాథ్‌రెడ్డి, అతని భార్య మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. తనను ఇంట్లోని ఓ రూమ్‌లో పెట్టి బంధించారని.. బయటకు రాకుండా రాత్రికి రాత్రే అడ్డంగా గోడ కట్టారంటూ ఏక్‌నాథ్‌రెడ్డి భార్య కంప్లెయింట్ చేశారు. దీంతో ఏక్‌నాథ్‌రెడ్డిపై వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.