అన్నాచెల్లి.. ఓ రాఖీ పండుగ.. మధ్యలో రాజకీయం

కవిత కోసం అంత కష్టపడితే చివరకు తన మీదే విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే..ఆమె ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారనే భావన కేటీఆర్‌లో ఉందట.

ktr and kavitha

రాజకీయం.. ఈ పదానికి ఎంతో బలం ఉంది. అంతే వివాదాస్పదం కూడా. ఆప్తమిత్రులను దూరం చేస్తుంది. అన్నాదమ్ముళ్లను చెరో పార్టీలో ఉండేలా చేస్తోంది. చివరకు అన్నాచెల్లెల్ల మధ్య వైరం పెంచుతోంది. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విషయంలో ఇప్పుడిది స్పష్టమవుతోంది. వాస్తవానికి రాఖీ పండుగ వచ్చిందంటే చాలు..తెలుగు స్టేట్స్‌ ప్రజల చూపంతా కేటీఆర్, కవిత జరుపుకునే రాఖీ పండుగ మీదే కాన్సంట్రేషన్ ఉండేది. గతేడాది అయితే కవిత జైలులో ఉండి కేటీఆర్‌కు రాఖీ కట్టలేకపోయారు. జైలు నుంచి వచ్చాక అన్నకు రాఖీ కట్టి చాలా ఎమోషనల్ అయ్యారు కవిత. ఇక ఈ సారి సీన్‌ రివర్స్ అయింది.

కొన్నాళ్లుగా కవితకు, బీఆర్ఎస్ మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఆ మధ్య కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆయనకు చాలా హెడెక్‌గా మారాయి. అయినా కవిత విషయంలో ఎక్కడా ఓపెన్‌ స్టేట్‌మెంట్లు ఇవ్వడం లేదు కేటీఆర్. కవిత మాత్రం బీఆర్ఎస్‌ టార్గెట్‌గా, కేటీఆర్‌ను ఇరకాటంలో పెట్టేలో ఎప్పుడు ఏదో ఒక కామెంట్స్‌ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కవితపై కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని..ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా రూట్ మారుస్తూ వచ్చారు.

Also Read: ఈసీపై నమ్మకం లేదా? ఎంపీ పదవికి రాజీనామా చేయండి- రాహుల్ గాంధీకి బీజేపీ డిమాండ్

కేసీఆర్‌ కోపాన్ని చల్లార్చేందుకు, కేటీఆర్‌కు దగ్గరయ్యేందుకు కవిత టోన్‌ మార్చారన్న టాక్ బీఆర్ఎస్‌లో వినిపిస్తూ వస్తోంది. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ధర్నా చేశారు. తర్వాత కమిషన్‌ రిపోర్ట్‌పై బీఆర్ఎస్‌ కంటే ముందే లీగల్‌ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత రామన్నతో గ్యాప్‌ లేదు. రాజకీయం వేరు రక్తసంబంధం వేరంటూ రక్షాబంధన్‌ దగ్గరకు వచ్చిన వేళ ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలోనే రక్షాబంధన్‌ రోజు కేటీఆర్‌కు రాఖీ కట్టి అన్నకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారట కవిత. అయితే కవిత తీరు ఆమె వ్యాఖ్యలు కేటీఆర్‌కు చాలా చిరాకు తెప్పించాయట. కేసీఆర్‌తో పాటు తనను, బీఆర్ఎస్ క్యాడర్‌ను ఇరకాటంలో పడేసేలా వ్యవహరిస్తున్నారన్న కోపంలో ఉన్నారట. అందుకే కవితకు దూరంగా ఉండాలని భావించారని..ఆమె పేరు కూడా ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.

అయితే కేటీఆర్‌కు రాఖీ కడుతానని మీడియా ఇంటర్యూల్లో చెప్పినట్లుగా కవిత కేటీఆర్‌కు రాఖీ కట్టేందుకు రెడీ అయ్యారట. రాఖీ కట్టడానికి ఇంటికి వస్తానంటూ ఒక రోజు ముందు కేటీఆర్‌కు మెస్సేజ్ పెట్టార కవిత. అయితే అదే లగచర్ల బాధితులతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్..ఆ తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్లారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత కవిత మెస్సేజ్‌కు రిప్లై ఇచ్చారట కేటీఆర్. తాను ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నానంటూ చెల్లికి మెస్సేజ్ చేశారట. దీంతో రాఖీ పండుగ పూట ఇంట్లోనే ఉండిపోయిన కవిత..జాగృతి కార్యకర్తలకు, నేతలకు, తన ఆప్తులకు రాఖీ కట్టి మిన్నకుండిపోయారట.

కవిత తీవ్ర మనస్తాపం 
తాను రాఖీ కట్టేందుకు వస్తానని ముందే చెప్పినా తన సోదరుడు అందుబాటులో లేడని.. తీవ్ర మనస్థాపానికి గురయ్యారట కవిత. అయితే కేటీఆర్‌ అందుబాటులో ఉండరని తెలిసి కూడా కవిత ముందస్తు ప్లాన్ ప్రకారం కామెంట్స్ చేస్తూ వచ్చారన్న గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి..ప్రత్యర్థులకు అస్త్రంగా మారి..రక్తసంబంధ అంటూ వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ఆఫ్‌ ది రికార్డులో మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు న్యాయవాదులతో చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో కేటీఆర్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటే కవిత రాఖీ కట్టేదా.? కవిత రాఖీ కడుతుందనే కేటీఆర్ కోర్టు కేసు పేరుతో ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ జరుగుతోంది.

ముందస్తు ప్లాన్ ప్రకారమే రామన్నకు రాఖీ కడుతానని కవిత స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారని అంటున్నారు గులాబీ లీడర్లు. కేటీఆర్‌కు దగ్గరయ్యేందుకు వేరే మార్గం లేకపోవడంతో రాఖీ పండుగను అస్త్రంగా వాడుకోవాలనుకున్నారట కవిత. కానీ ఆమె ప్లాన్ వర్కౌట్ కాలేదంటున్నారు. కవిత తీరుతో కేసీఆర్, కేటీఆర్ చాలా ఆవేదన, కోపం, ఆగ్రహంతో ఉన్నారని..అయినా ఆమెను ఒక్కమాట కూడా అనడం లేదంటున్నారు. కానీ తాను రాఖీ కడుతానంటే కేటీఆర్‌ అందుబాటులో లేడని చెప్పి ఆయన్ను ఇప్పుడు కూడా బ్లేమ్‌ చేయాలన్న ప్లాన్‌లో కవిత ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీని డ్యామేజ్ చేసేలా కవిత వ్యవహరిస్తుందని..తండ్రి, సోదరుడి కంటే లక్షలాది మంది బీఆర్ఎస్‌ కార్యకర్తలు, నేతల కంటే ఆమెకు సొంత రాజకీయ ఎజెండా ఎక్కువైపోయిందన్న కోపం కేటీఆర్‌కు ఉందట. అందుకే కవితనను కలిస్తే బీఆర్ఎస్‌ క్యాడర్‌లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని కేటీఆర్ ఆలోచించి ఉంటారన్నర టాక్ వినిపిస్తోంది. చెల్లి జైలులో ఉంటే..ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు ఎక్కని మెట్టు లేదు..మొక్కని దేవుడు లేడన్నట్లుగా..ఎంత శ్రమించారో అతనికే తెలుసంటున్నారు.

కవిత కోసం అంత కష్టపడితే చివరకు తన మీదే విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే..ఆమె ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారనే భావన కేటీఆర్‌లో ఉందట. అందుకే హైదరాబాద్‌లో అందుబాటులో ఉండి రాఖీ కట్టించుకోకపోయినా ఓ ఇబ్బంది అనుకున్నారట. పైగా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీల ఫిరాయింపుపై కూడా లీగల్ ఫైట్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.