Rahul Gandhi: ఈసీపై నమ్మకం లేదా? ఎంపీ పదవికి రాజీనామా చేయండి- రాహుల్ గాంధీకి బీజేపీ డిమాండ్

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా జీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు.

Rahul Gandhi: ఈసీపై నమ్మకం లేదా? ఎంపీ పదవికి రాజీనామా చేయండి- రాహుల్ గాంధీకి బీజేపీ డిమాండ్

Updated On : August 9, 2025 / 9:00 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఎన్నికల సంఘంపై నమ్మకం లేకపోతే లోక్‌సభ సభ్యత్వానికి “నైతిక కారణాల” ఆధారంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.”ఓటు దొంగతనం” వాదనపై రాతపూర్వక ప్రకటనను సమర్పించనందుకు తీవ్రంగా విమర్శించింది.

”రాహుల్ గాంధీ, మీరు ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టు చేసిన పరిశీలనలను విశ్వసించకపోతే, ఒక పని చేయండి. ముందుగా, మీరు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయండి” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు సైతం వరుసగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారు ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.

మీడియా ముందు రాహుల్ గాంధీ “నిరాధారమైన ఆరోపణలు” చేశారు. ఈసీ అడిగినప్పుడు రుజువు ఇవ్వడానికి లేదా లిఖిత ప్రకటన ఇవ్వడానికి నిరాకరించారు అని భాటియా ధ్వజమెత్తారు. గత సుప్రీంకోర్టు తీర్పు నుండి సారాంశాలను చదివి వినిపించారు భాటియా. ఎన్నికల సంఘం నిజాయితీపై ఎటువంటి సందేహం లేదని అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందని, సంవత్సరాలుగా ఎన్నికల సంఘం నిష్పాక్షిక సంస్థగా తన ఖ్యాతిని పెంచుకుందని రికార్డులో ఉందని వెల్లడించారు.

తమ పార్టీ అగ్ర నాయకులకు ఎన్నికల కమిషన్ పై నమ్మకం లేనందున.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా జీనామా చేయాలని భాటియా డిమాండ్ చేశారు. “మీకు ఏది అనుకూలమో, మీరు అంగీకరిస్తారు. ఏది అసౌకర్యంగా ఉందో, దాన్ని మీరు తిరస్కరిస్తారు. ఎన్నికల కమిషన్‌పై నిందలు వేస్తారు. ఇది కరెక్ట్ కాదు” అని రాహుల్ గాంధీపై మండిపడ్డారు భాటియా. “ఓటు చోరి” ఆరోపణలకు ప్రమాణం కింద అఫిడవిట్ దాఖలు చేయాలని EC డిమాండ్ చేయగా, రాజ్యాంగంపై ప్రమాణం చేశానని రాహుల్ గాంధీ చెప్పారు.

“ఈసీ నన్ను అఫిడవిట్ దాఖలు చేసి, ప్రమాణం కింద సమాచారం ఇవ్వాలని అడుగుతుంది. నేను పార్లమెంటు లోపల, రాజ్యాంగం ముందు, రాజ్యాంగంపై ప్రమాణం చేశాను” అని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: 4.5 కి.మీ పొడవు, 7 పవర్ ఫుల్ ఇంజిన్లు, 354 వ్యాగన్లు.. ఆసియాలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ‘రుద్రాస్త్ర’.. ప్రత్యేకతలివే..