Rudrastra: 4.5 కి.మీ పొడవు, 7 పవర్ ఫుల్ ఇంజిన్లు, 354 వ్యాగన్లు.. ఆసియాలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ‘రుద్రాస్త్ర’.. ప్రత్యేకతలివే..
చందౌలిలోని గంజ్‌ఖ్వాజా రైల్వే స్టేషన్ నుండి జార్ఖండ్‌లోని గర్వా వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ గూడ్స్ రైలు మొత్తం ప్రయాణాన్ని 5 గంటల్లో పూర్తి చేసింది.

Rudrastra: రుద్రాస్త్ర.. అతి పొడవైన సరుకు రవాణా రైలును నడపడం ద్వారా భారతీయ రైల్వేలు ఒక ప్రధాన మైలురాయిని సాధించాయి. 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆరు బాక్స్ రేక్‌లను కలపడం ద్వారా అసెంబుల్ చేశారు. ఒక్కొక్కటి రెండు గూడ్స్ రైలు రాక్‌లను కలిగి ఉంటుంది. ఏడు లోకోమోటివ్‌లతో శక్తిని పొందుతుంది.
తూర్పు మధ్య రైల్వేలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ ద్వారా నిర్వహించబడుతున్న రుద్రాస్త్ర, వస్తువులను వేగంగా లోడ్ చేయడానికి, రవాణా చేయడానికి వీలుగా DDU నుండి ధన్‌బాద్ డివిజన్ వరకు నడిచింది. “ఈ కొత్త ప్రయోగం సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది, వనరుల వినియోగాన్ని తగ్గిస్తుంది, సమయాన్ని ఆదా చేస్తుంది” అని డివిజనల్ రైల్వే మేనేజర్ ఉదయ్ సింగ్ మీనా తెలిపారు.
గురువారం చందౌలిలోని గంజ్‌ఖ్వాజా రైల్వే స్టేషన్ నుండి జార్ఖండ్‌లోని గర్వా వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ గూడ్స్ రైలు మొత్తం ప్రయాణాన్ని 5 గంటల్లో పూర్తి చేసింది. సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది.
రైల్వే అధికారుల ప్రకారం 354 వ్యాగన్లతో రుద్రాస్త్ర భారతదేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు మాత్రమే కాదు, ఆసియాలో కూడా అతిపెద్దది. ఈ రైలును ముందు 2 ఇంజిన్లు, ప్రతి 59 బోగీల తర్వాత ప్రతి రాక్‌తో ఒకటి జతచేసే విధంగా తయారు చేశారు. 345 వ్యాగన్లను నడిపించడానికి మొత్తం 7 ఇంజిన్లు ఉపయోగించబడ్డాయి.
మొత్తంగా భారతీయ రైల్వే తన చరిత్రలోనే ఓ అద్భుతమైన రికార్డ్ నెలకొల్పింది. దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలును విజయవంతంగా నడిపి రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ‘రుద్రాస్త్ర’ పేరుతో పిలుస్తున్న ఈ భారీ రైలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అద్భుత ప్రయోగానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ లో షేర్ చేశారు. ఈ ఘనత సాధించిన రైల్వే బృందాన్ని ఆయన అభినందించారు. ఈ రికార్డుతో భారత రైల్వే సరకు రవాణా సామర్థ్యంలో మరో మైలురాయిని అధిగమించినట్లయింది. 6 ఖాళీ బాక్సన్ రేక్‌లు (అంటే 6 గూడ్స్ రైళ్లు) ఒకేసారి దానికి జత చేయబడిందని, ఇదే ఈ గూడ్స్ రైలు ప్రత్యేకత అని రైల్వే అధికారులు తెలిపారు.
‘Rudrastra’ – Bharat’s longest freight train (4.5 km long) pic.twitter.com/Ufk2MFnpfl
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 8, 2025