Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy – Congress: ఖమ్మం (Khammam) జిల్లాలో తన అనుచరులు మువ్వ విజయ్ బాబు, చీకటి కార్తీక్‌తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చట్టం కేసీఆర్ (KCR)కు చుట్టమా? అని అన్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.
తనకుగానీ, తన కార్యకర్తలకు గానీ ఏం జరిగిన కేసీఆర్ దే బాధ్యతని పొంగులేటి చెప్పారు. ఎంత మందిని చంపుతారో చంపండని అన్నారు. బెదిరింపులకు భయపడబోమని అన్నారు. తన ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామని తెలిపారు. తన మద్దతుదారులు, కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ భయపడే అవసరం లేదని అన్నారు. తాను చట్టబద్ధంగా పోరాడుతానని తెలిపారు.
కొంతమంది అధికారులు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారు గులాబీ రంగు దుస్తులు ధరించినా సరేనని చెప్పారు. కొంత మంది అధికారులు భవిష్యత్తులో శిక్ష ఎదుర్కోకతప్పదని, న్యాయపోరాటం చేస్తానని అన్నారు. అంతేగానీ, భయపడి వెనక్కు తగ్గబోమని చెప్పారు.
ఖబడ్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లు
ఖమ్మంలోని మమత హాస్పిటల్ ఏరియాలో పొంగులేటి, మువ్వా విజయ్ బాబు, కార్తీక్ ను హెచ్చరిస్తూ పోస్టర్లు కనపడడం కలకలం రేపుతోంది. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలియడం గమనార్హం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని విజయ్ బాబు క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రాణాలు ఉండవని పోస్టర్లలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు.