Ponguleti Srinivas Reddy: వారి నుంచి సున్నితమైన వార్నింగ్ లు వచ్చాయి..! ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నామీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. మా మీద, మువ్వా విజయబాబు మీద వేధింపులు మొదలు పెట్టారు.

Ponguleti Srinivas Reddy

IT Raids : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ అధికారులు పదిమంది ఇంటికి వచ్చారని అన్నారు. నాకు ముందే తెలుసు.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బీజేపీతో చేతులు కలిపి ఐటీ దాడులను చేయిస్తున్నాడని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

Also Read : IT Raids On Ponguleti house: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నామీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. మా మీద, మువ్వా విజయబాబు మీద వేధింపులు మొదలు పెట్టారు. బీజేపీలోకి రాలేదని బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లానని బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీలోకి రావాలని ఆనాడు చెప్పారు. నేను వెళ్లలేదు. కానీ, సున్నితమైన వార్నింగ్ లు బీజేపీ నేతల నుంచి కూడా వచ్చాయని పొంగులేటి అన్నారు. నామినేషన్ వేయాలని అనుకున్నరోజే ఉద్దేశ పూర్వకంగా నన్ను, నన్ను నమ్ముకున్న వారిని భయబ్రాంతులకు గురిచేయడంకోసం ఈ ఐటీదాడులు జరిగాయని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : PM Modi Visit L.K. Advani : బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని పరామర్శించిన ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్

కేసీఆర్ ను విమర్శించే వారిని కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ఆయనకు అలవాటే. రాజ్యాంగపరంగా పోరాడతా. ఎన్ని సోదాలు చేసిన, ఇబ్బందులు పెట్టిన భయపడను. జైల్లో పెట్టినా నేను వెనక్కి తగ్గేది లేదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంటే వారిపై ఎందుకు దాడులు చేయరని పొంగులేటి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తా. దొడ్డిదారిన ఇబ్బందులు పెడుతున్నారు.. ప్రజలు ఆ రెండు పార్టీలకు సరియైన బుద్ధి చెబుతారు అంటూ పొంగులేటి హెచ్చరించారు.