PM Modi Visit L.K. Advani : బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని పరామర్శించిన ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

PM Modi visit L.K. Advani
PM Modi Visit L.K. Advani And Wish : మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షాలు నవంబర్ 8న అద్వానీ నివాసంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు.
అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో మోదీ తెలిపారు. ఎల్ కే అద్వానీని కలిసిన ఫొటోలను కూడా పంచుకున్నారు. ”అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే స్మారక సహకారాలు చేసిన సమగ్రత, అంకితభావానికి ఒక వెలుగు” అని మరొక పోస్ట్‌లో అభివర్ణించారు.
Bus Catches Fire : ఢిల్లీ-జైపూర్ హైవేపై బస్సులో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనం
అద్వానీ దార్శనిక నాయకత్వం జాతీయ ప్రగతిని, ఐక్యతను పెంపొందించిందని కొనియాడారు. అద్వానీ మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. దేశ నిర్మాణానికి అద్వానీ చేస్తున్న కృషి 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు.
అద్వానీ అవిరామ కృషితో బీజేపీని బలోపేతం చేశారు : అమిత్ షా
అద్వానీ దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా అమిత్ షా ఆకాంక్షించారు. అద్వానీ అవిరామ కృషి, సంస్థాగత నైపుణ్యాలతో బీజేపీని బలోపేతం చేశారని కొనియాడారు. బీజేపీ ఆవిర్భావం నుండి అధికారంలోకి వచ్చే వరకు అద్వానీ సాటిలేని సహకారం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తినిచ్చే అంశమని తెలిపారు.
అద్వానీ మనందరికీ స్ఫూర్తిదాయకం : రాజ్ నాథ్ సింగ్
అద్వానీ మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షు ఉండాలని ప్రార్థించినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆయన బీజేపీకి గొప్ప బలాన్ని అందించారని కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఎల్‌కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మనందరికీ ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎల్ కే అద్వానీ భారత రాజకీయాలలో మూల స్థంభగా ఉన్నాడని తెలిపారు.
బీజేపీకి కూడా గొప్ప బలాన్ని అందించారని తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో చురుగ్గా పనిచేసిన అద్వానీ సహకారం మరువలేనిదని కొనియాడారు. ఎల్ కే అద్వానీ ఆరోగ్యం బాగుండాలని, కలకలాలం దీర్ఘాయుష్షుతో ఉండాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ లో రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.