Minister Ponguleti Srinivasa Reddy
ఫార్ములా-ఈ రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. కేటీఆర్ నిర్దోషి అయితే విచారణకు సహకరించాలని అన్నారు. కేటీఆర్ అరెస్టయితే అది కక్ష పూరితంగా చేసిన అరెస్ట్ కానేకాదని చెప్పారు.
ఈ కేసు రాజకీయ లబ్ధి కోసం కాదని, వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వం వెళుతుందని పొంగులేటి తెలిపారు. తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. డబ్బు పంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో రెండు వేల ఎకరాల భూ భాగోతం కూడా జరిగిందని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చిందని చెప్పారు.
కేటీఆర్ ట్వీట్‌లో కొత్తదనం కనిపిస్తోందని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసులో కోట్లాది రూపాయల నిధులు తప్పుదారి పట్టించింది నిజమని చెప్పారు. ఆ డబ్బులు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్నదే బయటికి రావాలని అన్నారు. ఆ డబ్బులు తిరిగి బీఆర్‌ఎస్‌కు అందాయన్నది తన అనుమానమని చెప్పారు.
బీఆర్‌ఎస్ దేశంలోనే రిచ్చెస్ట్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ అని, అంతకంటే బీఆర్‌ఎస్ ఎలా రిచ్ గా ఉందని ప్రశ్నించారు. పవర్, కాళేశ్వరం, లాండ్స్, ఓఆర్ఆర్ దేనిలో ఏ అవకతవకలు తోడినా ఆ కుటుంబం వాళ్లే ఉంటున్నారని చెప్పారు.
ఐసీయూలో ప్రశాంత్ కిశోర్.. ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం