Hyderabad Central University : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం ఆర్చ్ స్లాబ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడే పని చేస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడం గమనించిన కార్మికులు, తోటి సిబ్బంది వెంటనే స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడ్డ కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్తుగా కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read : ప్రధాని మోదీనే సీఎం రేవంత్‌ను ఢిల్లీకి పిలిచారా?
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఆర్చ్ స్లాబ్ కూలిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అటు, దీనిపై అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హెచ్ సీయూలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవసరాలకు సరిపోకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్ కు పని అప్పగించారు. అయితే, మొదటి ఫ్లోర్ సెంట్రింగ్ వేస్తున్న సమయంలోనే కుప్పకూలింది. అప్పటికే సెంట్రింగ్ పైన ఐరన్ రాడ్లు అమర్చారు. శ్లాబ్ పోయడానికి ఏర్పాట్లు చేసిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.