Revanth Reddy: ప్రధాని మోదీనే సీఎం రేవంత్‌ను ఢిల్లీకి పిలిచారా?
గతంలో రెండుసార్లు సీఎం రేవంత్ ప్రధానిమోదీతో ఇలా సమావేశమైనా..ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా భేటీ జరిగిందని అంటున్నారు.

సీఎం రేవంత్ ఢిల్లీ టూర్. తెలంగాణ పాలిటిక్స్‌లో ఏడాదిగా ఇదొక రెగ్యులర్ ఎపిసోడ్. ఇప్పటికీ 35సార్లకు పైగా హస్తినకు వెళ్లిన సీఎం..తెలంగాణకు రూపాయి నిధులు కూడా తేలేదని అపోజిషన్ బీఆర్ఎస్ అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇక రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారంటే చాలు కాంగ్రెస్ పార్టీలో ఒకటే చర్చ. ఈ సారి మంత్రివర్గ విస్తరణ పక్కా అని నేతల గుసగుసలు వినిపిస్తుంటాయి. కానీ సీఎం రేవంత్ లేటెస్ట్ ఢిల్లీ టూర్‌పై అటు కాంగ్రెస్ పార్టీలో..ఇటు తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సాధారణంగా ప్రధానమంత్రిని ఏ రాష్ట్ర సీఎం అయినా అపాయింట్‌మెంట్ అడిగి ఆయన సమయం ఇస్తే వెళ్లి కలవడం కామన్. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలైతే ఏదైనా ముఖ్యమైన అంశం ఉంటే స్వయంగా ప్రధాని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడుతుంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఇందుకు విరుద్దంగా జరిగిందన్న చర్చ జరుగుతోంది.
కీలక అంశాలపై మోదీతో చర్చ
సీఎం రేవంత్ మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీతో డిస్కస్ చేసినట్లు చెబుతున్నారు. అరగంటపాటు జరిగిన సమావేశంలో మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులకు సహకారం కావాలని సీఎం మోదీని రిక్వెస్ట్ చేసినట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
గతంలో రెండుసార్లు సీఎం రేవంత్ ప్రధానిమోదీతో ఇలా సమావేశమైనా..ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా భేటీ జరిగిందని అంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ స్వయంగా అపాయింట్‌మెంట్ ఇచ్చి మరీ పిలిపించుకుని మాట్లాడారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రొటీన్‌కు భిన్నంగా ప్రధాని మోదీనే..రేవంత్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారట.
సాధారణంగా ఏ రాష్ట్ర సీఎం ఢిల్లీ వెళ్లినా తమ రాష్ట్రానికి ఏం కావాలో చెబుతూ వినతిపత్రాలు ఇచ్చి వస్తుంటారు. కానీ ప్రధాని మోదీ రివర్స్‌లో సీఎం రేవంత్ ముందే కొన్ని ప్రతిపాదనలు ఉంచారన్న టాక్ ఆసక్తికరంగా మారింది. 2016 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి రాష్ట్ర వాటా, ప్రాజెక్టుల భూసేకరణ నిధుల పెండింగ్, భువనగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి ఇవ్వాల్సిన 1300 కోట్లు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, ఇతర పెండింగ్ అంశాలను రేవంత్ దృష్టికి తీసుకొచ్చారట మోదీ.
అసలేం జరుగుతోంది?
ఇలా రేవంత్ వినతిపత్రం తీసుకున్న ప్రధాని.. రేవంత్ ముందు ఇలాంటి ప్రతిపాదనలు ఉంచడంతో ..అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రానికి పెండింగ్ లో పడ్డ బకాయిలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ముందుపెట్టారట ప్రధాని మోదీ. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, సహకారంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని కేంద్రం సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ టార్గెట్ చేశారు.
తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, ఇతర కేటాయింపులపై ప్రజల్లో చర్చ పెట్టే ఆలోచనలో సీఎం ఉన్నారన్న టాక్ కూడా వినిపించింది. సరిగ్గా ఇదే టైమ్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు ప్రధాని. అయితే ఈ భేటీ వెనక ఎవరి రాజకీయ ఎత్తుగడలు వాళ్లకు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అరగంట భేటీలో మంత్రి శ్రీధర్ బాబు లేకుండా మోదీ, రేవంత్ రెడ్డి..పది నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆ రహస్య బేటీ మర్మమేంటో పెరుమాళ్లకెరుక.