GN saibaba
GN saibaba passed away: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీ.ఎస్. సాయిబాబా మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఇటీవల హైదరాబాద్ లోని నిమ్స్ లో చేరిన సాయిబాబా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రొఫెసర్ సాయిబాబా పార్ధివ దేహాన్ని రేపు ఉదయం నిమ్స్ హాస్పటల్ నుండి గన్ పార్క్ కు తీసుకెళ్తామని, అక్కడి నుంచి మౌలాలి జవహర్ నగర్ లోని ఆయన స్వగృహానికి తరలించడం జరుగుతుందని ఆయన బంధువులు తెలిపారు. మౌలాలిలో రెండు గంటల పాటు ప్రజల సందర్శనార్ధం ఉంచి.. అనంతరం పార్ధివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయనున్నట్లు బంధువులు తెలిపారు.
Also Read: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత..
చెరుకు సుధాకర్ మామాట్లాడుతూ.. తన శరీరానికి వైకల్యం ఉన్నాసరే దేశం దివ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా అని అన్నారు. ఏం చేయకపోయినా పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టిందని, జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేక పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లు వెంటాడి ఆయన్ను వేదించింది.. ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వ్యక్తులను ఒక్కరినైనా తయారు చేయగలమా. సమాజం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పించి బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలపాలని సుధాకర్ పేర్కొన్నారు.
మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉన్నాడనే ఆరోపణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు పదేళ్ల పాటు జైల్లోనే ఉన్న ఆయన 2024 మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు. సాయిబాబా వయస్సు 57 సంవత్సరాలు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు.