Pudding And Mink : పబ్‌ డ్రగ్స్ కేసు..నోరు మెదపని నిందితులు? ముగియనున్న విచారణ

వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నా... విచారణకు సహకరించడం లేదు. నిందితులు ఇద్దరి మొబైల్‌ ఫోన్లలో ఉన్న డేటాపై కూపీ లాగుతున్నారు పోలీసులు. పలువురు డ్రగ్స్ పెడ్‌లర్...

Pudding And Mink Pub Case

Pudding And Mink Pub : సంచలనం సృష్టించిన పుడింగ్ అండ్ మింక్ పబ్‌ డ్రగ్స్ కేసులో నాలుగో రోజు కస్టడీలో నిందితుల విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల విచారణలో నిందితులు నోరు మెదపలేదు. డ్రగ్స్ కేసులో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తమకేమీ తెలియదని సమాధానం చెబుతున్నారు నిందితులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరెవరికి సరఫరా చేశారు? రైడ్స్ జరిగిన రోజు ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. ముందుగానే లీగల్‌ సలహా తీసుకుని నిందితులు గేమ్‌ ప్లాన్ ఫిక్స్‌ చేసుకున్నట్లుగా సమాచారం.

Read More : Drugs Case : పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌.. డ్రగ్స్‌ కేసులో కీలకంగా మారిన సీసీ టీవీ ఫుటేజ్‌

పబ్‌లో పార్టీకి వచ్చిన కస్టమర్సే డ్రగ్స్ తెచ్చుకున్నారని చెబుతున్నారు నిందితులు అభిషేక్, అనిల్. గత మూడు రోజులగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్ వింగ్, బంజారాహిల్స్ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నా… విచారణకు సహకరించడం లేదు. నిందితులు ఇద్దరి మొబైల్‌ ఫోన్లలో ఉన్న డేటాపై కూపీ లాగుతున్నారు పోలీసులు. పలువురు డ్రగ్స్ పెడ్‌లర్ నంబర్లపై ఆరా తీస్తున్నారు. గోవా, ముంబై, నైజీరియా నుంచి కొకైన్ తీసుకొచ్చి పబ్‌లో అమ్ముతున్నట్లుగా గుర్తించిన పోలీసులు… ఆ దిశగా విచారణ చేపట్టినా నిందితులు మాత్రం నోరు మెదపడంలేదని సమాచారం. ఇక 2022, ఏప్రిల్ 17వ తేదీ ఆదివారంతో కస్టడీ ముగియనుంది. దీంతో కస్టడీలో నిందితుల విచారణ కీలకంగా మారింది.

Read More : Hyd Drugs Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. టెకీలకు కిక్కిస్తోన్న కంపెనీలు..!

బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో అనిల్, అభిషేక్ లు వేసిన బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరినీ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈనెల 14 నుంచి 18 వరకు నిందితులిద్దరినీ పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో దొరికిన డ్రగ్స్‌కి వీరికి ఉన్నసంబంధాలపై పోలీసులు విచారణలో తేల్చేపనిలో ఉన్నారు.